రైతుల రుణ మాఫీ ఫైలుపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి

రైతుల రుణ మాఫీ ఫైలుపై తొలి సంతకం చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

Last Updated : Dec 17, 2018, 06:23 PM IST
రైతుల రుణ మాఫీ ఫైలుపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి

భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్ నేత కమల్ నాథ్.. ప్రమాణస్వీకారం అనంతరం రైతుల రుణమాఫీ ఫైలుపై తన తొలి సంతకాన్ని చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తాను రైతు రుణాల మాఫీ ఫైలుపై తొలి సంతకాన్ని చేసినట్టు ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రకటించారు. మధ్యప్రదేశ్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ రాష్ట్రంలో ఒక్కో రైతుకు రూ.2 లక్షల మేర రుణమాఫీ కానుంది. వివిధ జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాల్లో రూ.2 లక్షల వరకు మాఫీ చేసేందుకు మధ్యప్రదేశ్ సర్కార్ ముందుకొచ్చింది.

Trending News