Maha Kumbhmela 2025: మహా కుంభమేళాలో నిర్వహణలో యోగి సర్కార్ భారీ మార్పులు..

Maha Kumbhmela 2025: మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  మ‌హాకుంభ్‌లో వీవీఐపీ పాసుల‌ను ర‌ద్దు చేసింది. ప్ర‌యాగ్‌రాజ్ ప్రాంతాన్ని నో వెహిక‌ల్ జోన్‌గా ప్ర‌క‌టించింది. మంగ‌ళ‌వారం మౌనీ అమావాస్య సందర్భంగా త్రివేణి సంగం ఘాట్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌లో 30 మంది మృతిచెందారు. ఈ నేప‌థ్యంలో యోగి స‌ర్కార్ కీల‌క నిర్ణయాలు తీసుకుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 31, 2025, 01:35 AM IST
Maha Kumbhmela 2025: మహా కుంభమేళాలో నిర్వహణలో యోగి సర్కార్ భారీ మార్పులు..

Maha Kumbhmela 2025: మౌనీ అమావాస్య సందర్భంగా దాదాపు 10 కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమానికి పోటెత్తారు.దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో దాదాపు 30 మంది కన్నుమూసారు. 60 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారినీ సమీపంలోని ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మౌనీ అమావాస్య సందర్బంగా జరిగిన తొక్కిసలాట నేపత్యంలో యూపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా కుంభమేళా జరిగే ప్రాంతంలో  ట్రాఫిక్, భక్తుల రద్దీ, పలు శాఖల మధ్య సమన్వయాన్ని పర్యవేక్షించడానికి ఐదుగురు ప్రత్యేక కార్యదర్శి స్థాయి అధికారులను నియమించారు. వీరు కుంభమేళాలో ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఫిబ్రవరి 12 వరకు ప్రయాగ్​ రాజ్ లోనే ఉంటారు. అలాగే మెరుగైన భద్రత కోసం పోలీసు సూపరింటెండెంట్ స్థాయి అధికారులను కూడా మోహరించనున్నారు. 2019 కుంభమేళా సమయంలో ప్రయాగ్​ రాజ్ డివిజనల్ కమిషనర్‌గా పనిచేసిన ఆశిశ్ గోయల్, ఏడీఏ మాజీ వైస్ ఛైర్మన్ భాను గోస్వామిని ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు నియమించినట్లు యోగి ప్రభుత్వం పేర్కొంది.

మ‌హాకుంభ్ ప్రాంతంలోకి వాహ‌నాల ఎంట్రీని నిషేదించింది. వెహికిల్ ఎంట్రీ కోసం ఇచ్చే ప్ర‌త్యేక పాసుల‌కు కూడా అనుమ‌తి లేదు.వీవీఐపీ పాసుల‌ను కూడా  ర‌ద్దు చేసింది. ఏ వాహనానికి మినహాయింపు ఉండదు. వ‌న్‌వే రూట్ల‌ను అమ‌లు చేస్తున్నారు.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

భ‌క్తులు స‌లువుగా న‌డిచేందుకు వ‌న్‌వే ట్రాఫిక్ సిస్ట‌మ్‌ను అమ‌లు చేస్తున్నారు. ప్ర‌యాగ్‌రాజ్ స‌మీప జిల్లాల నుంచి వ‌స్తున్న వాహ‌నాల‌ను ఆ జిల్లా స‌రిహ‌ద్దుల‌కే ప‌రిమితం చేయ‌నున్నారు. డిస్ట్రిక్ బోర్డ‌ర్ల వ‌ద్ద వాహ‌నాల‌ను నిలిపివేస్తున్నారు. ర‌ద్దీని త‌గ్గించే ఉద్దేశంతో ఈ చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఫిబ్ర‌వ‌రి 4వ తేదీ వ‌ర‌కు చాలా క‌ఠిన నిబంధ‌న‌లు పాటించ‌నున్నారు. ప్ర‌యాగ్‌రాజ్‌లోకి ఫోర్ వీల‌ర్ వాహ‌నాల ఎంట్రీని నిలిపివేశారు. కోట్ల సంఖ్య‌లో భ‌క్తులు వ‌స్తున్న నేప‌థ్యంలో.. క్రౌడ్ మేనేజ్మెంట్ వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x