Biological E Vaccine: మరో మేకిన్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ త్వరలో అందుబాటులో రానుంది. మార్కెట్లో లభించే వ్యాక్సిన్లలో ఇది అత్యంత చవక కానుంది. మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తయితే మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు.
దేశంలో ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. సీరమ్ ఇనిస్టిట్యూట్ (Serum institute) ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ (Covishield) రాష్ట్ర ప్రభుత్వాలు 3 వందల రూపాయలకు, ప్రైవేటు ఆసుపత్రులకు 6 వందల రూపాయలకు విక్రయిస్తున్నారు. భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవ్యాగ్జిన్‌ను రాష్ట్రాలకు 4 వందలకు, ప్రైవేటు ఆసుపత్రులకు 12 వందలకు అమ్ముతోంది. అదే సమయంలో రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్(Sputnik V Vaccine)ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 995 రూపాయలకు విక్రయిస్తోంది. ఈ నేపధ్యంలో మరో మేకిన్ ఇండియా వ్యాక్సిన్ అందుబాటులో రానుంది.
హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ ఫార్మా(Biological E Pharma) కంపెనీ అభివృద్ధి చేస్తున్న కార్బేవ్యాక్స్ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులో రానుంది. ఈ వ్యాక్సిన్ అత్యంత కారు చవకగా తీసుకురానుంది. అత్యంత చవకగా ఒక్కొక్క డోసు 2 వందల కంటే తక్కువకే అందించనుంది. ప్రస్తుతం మొదటి, రెండవ ట్రయల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఇవి ఆశాజనకంగా ఉన్నాయని తేలింది. ఇక మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. దేశంలో అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నుంచి అనుమతి రావల్సి ఉంది. ఈ వ్యాక్సిన్ రెండు డోసులు కలిపి 4 వందల కంటే తక్కువ ఉండవచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 30 కోట్ల డోసుల్ని బుక్ చేసుకుంది. దీనికోసం ఆ సంస్థకు 15 వందల కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించింది.
Also read: India COVID-19 Cases: ఇండియాలో వరుసగా 24వ రోజు పాజిటివ్ కంటే డిశ్ఛార్జ్ కేసులు అధికం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Biological E Vaccine: త్వరలో దేశీయ మార్కెట్లో అత్యంత చవకగా మరో మేకిన్ ఇండియా వ్యాక్స