ఢిల్లీలోని కేరళ హౌజ్‌లోకి కత్తితో ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ ఆగంతకుడిని గేటు వద్దే ఉన్న భద్రతా బలగాలు పట్టుకున్నాయి. ఆగంతకుడు గట్టిగా అరుస్తూ కేరళ హౌజ్‌లోకి దూసుకొస్తుండటాన్ని గమనించిన భద్రతా సిబ్బంది అతడిని చాకచక్యంగా పట్టుకోగలిగారు. అదే సమయంలో కేరళ హౌజ్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఉండటంతో ఆగంతకుడి చొరబాటు ఘటనకు మరింత ప్రాధాన్యత చేకూరినట్టయింది. ఆగంతకుడి మానసిక పరిస్థితి సరిగా లేదని గుర్తించిన భద్రతా సిబ్బంది అతడిని ఢిల్లీలోని హ్యూమన్ బిహేవియర్ అండ్ అల్లైడ్ సైన్సెస్ ఇనిస్టిట్యూట్‌కి తరలించారు.
#WATCH: Man tries to barge inside Kerala House in Delhi with a knife. Kerala Chief Minister Pinarayi Vijayan was present inside. Police says, 'the man is 80% mentally unstable & has been sent to Institute of Human Behaviour and Allied Sciences'. pic.twitter.com/j2frHaYBUY
— ANI (@ANI) August 4, 2018
ఇదిలావుంటే, కేరళ హౌజ్‌లో ఈ ఘటన జరగడానికి కొద్ది గంటల ముందే జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా నివాసం వద్ద సైతం ఇటువంటి ఘటనే చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎటువంటి మారణాయుధాలు లేకుండానే తన SUV కారులో ఫరూఖ్ అబ్దుల్లా ఇంట్లో చొరబడేందుకు యత్నించిన ఓ ఆగంతకుడిని అక్కడే బందోబస్తులో ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు హతమార్చాయి. (పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి)