BJP fire on Kangana's comments : ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రైతు ఆందోళనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ అగ్రనాయకత్వం బలహీనంగా ఉంటే బంగ్లాదేశ్ లాంటి పరిస్ధితి మన దేశంలోనూ వచ్చి ఉండేవంటూ వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలను పార్టీ సీరియస్ గా తీసుకుంది. రైతుల ఉద్యమ సందర్భంలో కంగనా రనౌత్ ఇచ్చిన ప్రకటన ఆ పార్టీ అభిప్రాయం కాదని బీజేపీ స్పష్టం చేసింది. కంగనా ప్రకటనపై బీజేపీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది.
భారతీయ జనతా పార్టీ తరపున కంగనా రనౌత్‌కు పార్టీ విధానపరమైన అంశాలపై మాట్లాడేందుకు అనుమతి లేదా అధికారం లేదని జారీ చేసిన నోటీసులో పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు చేయవద్దని కంగనాను బీజేపీ ఆదేశించింది. భారతీయ జనతా పార్టీ 'సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్' సామాజిక సామరస్యం సూత్రాలను అనుసరించాలని నిశ్చయించుకుందని లేఖలో పేర్కొన్నారు.
Also Read : Highest FD Interest Rates: ఈ బ్యాంకులో బంపర్ ఆఫర్.. ఎఫ్డీపై ఏకంగా 9.5 శాతం వడ్డీ
రైతుల నిరసనలను కట్టడి చేసేందుకు మోదీ సర్కార్ గట్టి చర్యలు తీసుకుంటే ఇవి బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్ధితులకు దారితీసే ఛాన్స్ ఉందని బీజేపీ నేత, మండి ఎంపీ కంగనా రనౌత్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటంలో డెడ్ బాడీలు వేలాడుతూ కనిపించాయని, లైంగిక దాడులు చోటుచేసుకున్నాయని ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన వీడియోలో కంగనా ఆరోపణలు చేశారు.
సాగు చట్టాలను వెనక్కు తీసుకున్నా నిరసనలు కొనసాగేలా విదేశీ శక్తులు స్వార్థప్రయోజనాలు ఆశించేవారు ప్రోత్సహించారని ఫైర్ అయ్యారు. బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో మన దేశంలో కూడా అదే జరిగే అవకాశం ఉందన్నారు. విదేశీ శక్తులు దీనికి కుట్ర పన్నారంటూ ఆరోపించారు. దేశం కుక్కలపాలైనా వారికే పట్టదని విమర్శలు చేశారు. దీంతో కంగనా చేసిన వ్యాఖ్యలు సొంతపార్టీలోనే దుమారం లేపాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో నేడు బీజేపీ పార్టీ స్పందించింది. కంగనా చేసిన వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదని తెలిపింది. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయద్దంటూ కంగనాకు గట్టిగానే క్లాస్ పీకింది. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చింది. రైతుల గురించి మాట్లాడే హక్కు, అధికారం కంగానకు లేదని తెలిపింది. ఆమె వ్యాఖ్యలను వ్యక్తిగతంగా పరిగణించాలని పేర్కొంది.
Also Read : EPFO: 58 సంవత్సరాల కన్నా ముందే పెన్షన్ కావాలంటే.. EPFOలో ఎలా అప్లై చేసుకోవాలి..?
Kangana Ranaut: Bangladesh like anarchy could have happened in India also like in the name of Farmers protest. Outside forces are planning to destroy us with the help of insiders. If it wouldn't have been foresight of our leadership they would have succeded. pic.twitter.com/05vSeN8utW
— Megh Updates 🚨™ (@MeghUpdates) August 25, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.