హస్తానికి హ్యాండ్ ఇచ్చిన మాయ ; గౌరవమిచ్చిన వారికే మద్దతిస్తామని ప్రకటన

                      

Last Updated : Sep 21, 2018, 06:41 PM IST
హస్తానికి హ్యాండ్ ఇచ్చిన మాయ ; గౌరవమిచ్చిన వారికే మద్దతిస్తామని ప్రకటన

లక్నో : కాంగ్రెస్ మిత్రపక్షంగా వ్యహరిస్తున్న బీఎస్పీ సంచలన నిర్ణయం తీసుకుంది. చత్తీస్ గఢ్ లో హస్తం పార్టీని కాదని..అజిత్ జోగి నేతృత్వంలోని చత్తీస్ గఢ్ జనతా కాంగ్రెస్ తో చేతులు కలిపారు.  ఈ ఎన్నికల్లో అజిత్ జోగి పార్టీతో కలసి పోటీ చేస్తామని మాయావతి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చత్తీస్ గఢ్  ఎన్నికల్లో  35 సీట్లలో మేము పోటీ చేస్తాం...మిగిలిన చత్తీస్ గఢ్ జనతా కాంగ్రెస్ మిగతా 55 సీట్లలో పోటీ చేస్తుందని పేర్కొన్నారు. అజిత్ జోగి తదుపరి ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఈ సందర్భంగా మాయావతి స్పష్టం చేశారు.మహాకూటమిపై స్పందిస్తూ  ఏ రాష్ట్రంలో అయితే, మమ్మల్ని గౌరవంగా చూసి తగినన్ని సీట్లు ఇస్తారో, వారితోనే మేము కలుస్తాం" ఇదే మా పార్టీ వైఖరి అని మరోసారి తేల్చిచెప్పారు.

మాయా తీరుపై కాంగ్రెస్ గుస్సా

చత్తీస్ గఢ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అజిత్ జోగిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తరువాత ఆయన కొత్త పార్టీని పెట్టి కాంగ్రెస్ ఓట్లు చీల్చగా.. అది బీజేపీకి వరమై అధికారాన్ని సొంతం చేసుకుంది. తాజాగా బీఎస్పీ, అజిత్ జోగి పార్టీ తో పొత్తు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందనేది గమనార్హం. కాగా వచ్చే ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడి మోడీ సర్కార్ పై పోరాటం చేయాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి తాజా పరిణామం మింగుపడటం లేదు. బీఎస్పీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వైఖరి అనుసరిస్తుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

Trending News