మిజోరాం ఎన్నికలు 2018 : సీఎం నియోజకవర్గంలోనే అధిక పోలింగ్

మిజోరాం ఎన్నికలు 2018

Last Updated : Nov 28, 2018, 10:14 PM IST
మిజోరాం ఎన్నికలు 2018 : సీఎం నియోజకవర్గంలోనే అధిక పోలింగ్

ఐజ్వాల్: మిజోరాంలో నేడు 40 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం కాస్త తగ్గుముఖం పట్టింది. మిజోరాం ముఖ్యమంత్రి లాల్ తణల్వా పోటీ చేస్తోన్న సెర్ఛిప్ నియోజకవర్గం మినహాయిస్తే, మిగతా చాలా నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో ఓటింగ్ నమోదు కాలేదని తెలుస్తోంది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి 9శాతం ఓటింగ్ తక్కువ నమోదైంది. నేటి పోలింగ్‌లో 74.6 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆశిశ్ కుంద్రా తెలిపారు. 

మిజోరాం ముఖ్యమంత్రి లాల్ తణల్వా పోటీ చేస్తోన్న సెర్ఛిప్ నియోజకవర్గంలోనే అత్యధికంగా 81 శాతం పోలింగ్ నమోదైందని కుంద్రా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా సంతోషకరమైన విషయమని కుంద్రా పేర్కొన్నారు. 

Trending News