పరీక్షలు రాసే విద్యార్థులకు మోదీ చిట్కాలివే..!

పోటీ పరీక్షలతో పాటు స్కూలు పరీక్షలు రాసే విద్యార్థులకు భారత ప్రధాని స్వయంగా చిట్కాలు చెబుతున్నారు. "పరీక్షా పర్ చర్చా" కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో ఆయన స్వయంగా  మాట్లాడారు. అందులో పలు ఆసక్తికరమైన సమాధానాలు, మోదీ ప్రసంగంలోని ముఖ్యమైన విషయాలు మీకోసం..!

Last Updated : Feb 16, 2018, 07:08 PM IST
పరీక్షలు రాసే విద్యార్థులకు మోదీ చిట్కాలివే..!

పోటీ పరీక్షలతో పాటు స్కూలు పరీక్షలు రాసే విద్యార్థులకు భారత ప్రధాని స్వయంగా చిట్కాలు చెబుతున్నారు. "పరీక్షా పర్ చర్చా" కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో ఆయన స్వయంగా మాట్లాడారు. అందులో పలు ఆసక్తికరమైన సమాధానాలు, మోదీ ప్రసంగంలోని ముఖ్యమైన విషయాలు మీకోసం..!

*ఈ రోజు నేను భారత ప్రధానిని కాదు. మీ స్నేహితుడిని అనుకోండి. మీ మదిలో తొలిచే ప్రశ్నలు నన్ను అడగండి. నేను జవాబు చెబుతాను. ఈ కార్యక్రమం చివరిలో నాకు పదికి ఎన్ని మార్కులు వేస్తారో చూస్తాను

*విద్యార్థుల్లా.. ఎప్పుడూ మీరు మీలోని విద్యను అర్థించే వ్యక్తిని సజీవంగా ఉంచండి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. అది చాలా ముఖ్యం. మీరు పరీక్షకు బాగానే తయారవ్వచ్చు. కానీ మీ మీద మీకు నమ్మకం లేకపోతే.. అప్పుడు విజయం సాధిస్తామా లేదా అన్న అనుమానం మీలో కలుగుతుంది. స్వామి వివేకానంద అందుకే ఓ మాట అన్నారు. మీరు పరీక్షలు బాగా రాయడానికి ఎందరో దేవుళ్ళను పూజిస్తారు. కానీ చిత్తశుద్ధి లేని పూజలెందుకు. మీ మీద మీకు నమ్మకం లేకుండా.. కేవలం ప్రార్థనల వల్లే పరీక్షలు బాగా రాయగలమన్న అపోహను వీడండి. 

*విద్యార్థుల్లారా.. నేను హిందీలో మాట్లాడుతున్నాను. ఈ భాష మీకు అర్థం కాకపోవచ్చు. నాకు తమిళం, కన్నడం, మలయాళం భాషలు రావు. అందుకు నా అసక్తతను తెలియజేస్తున్నాను. 

*అందుకు క్షమించమని అడుగుతున్నాను. కానీ నా ప్రసంగంలోని ప్రతీ మాట మీ భాషల్లోకి అనువాదయ్యేలా.. మీ వద్దకు చేరేలా నేను తప్పకుండా చేస్తాను.

*మీ జ్ఞాపక శక్తి పెరగడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని నేను కచ్చితంగా చెప్పగలను.

*ఆత్మస్థైర్యం అనేది ప్రతీ విద్యార్థికి అవసరం. బాగా కష్టపడడం వల్ల మరియు మీరు చేసే పనులను మీరు ఛాలెంజింగ్‌గా తీసుకోవడం వల్లే మీరు ఆత్మస్థైర్యాన్ని పెంచుకోగలుగుతారు. 

*మీ చుట్టూ ఉండే జనాలతో మీరు పోటీ పడవద్దు.. మీతో మీరే పోటీపడండి. భారతీయ విద్యార్థి పుట్టుకతోనే రాజకీయ నాయకుడు

*చాలామంది పిల్లలు పరీక్షలకు సిద్ధం కాకముందు సరస్వతి దేవిని పూజిస్తారు. కానీ పరీక్షకు వెళ్తున్న రోజు మాత్రం హనుమాన్‌ని ధైర్యం కోసం పూజిస్తారు. అలాంటి ధైర్యం పెంచుకోవాలంటే ముందు మీపై మీకు నమ్మకం ఉండాలి. 

*ముఖ్యంగా చెప్పాల్సిందేమిటంటే.. పిల్లలు తల్లిదండ్రుల వైఖరిని ప్రశ్నించాలని చూడకూడదు. వారిని అనుమానించాలని భావించకూడదు. ఏ తల్లిదండ్రులైనా.. పిల్లలు ఉన్నతంగా ఉండాలనే కోరుకుంటారు. అయితే అదే విషయం తల్లిదండ్రులకు కూడా నేను చెబుతున్నాను. పిల్లలు చదువుతో పాటు ఆటలు, మిగతా అంశాలపై కూడా దృష్టి  పెట్టాల్సిన బాధ్యత మీపై ఉంది. మీ కోరికలను, కలలను వారిపై రుద్దకూడదు. మీ పిల్లలు ఎందులో రాణిస్తున్నారో అందులోనే వారిని ప్రోత్సహించాలి. 

*పిల్లలు ముందుగా ఒత్తిడిని దూరం చేసుకోవాలి. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి తమ దైనందిన జీవితంలో సంగీతం, కళలు మొదలైన వాటికి కూడా చోటు కల్పించాలి. ప్రకృతితో కూడా మమేకం కావాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి కూడా దూరమవుతుంది

*మనం ఐక్యూ (ఇంటిలిజెంట్ కోషెంట్) మరియు ఈక్యూ (ఇమోషనల్ కోషెంట్) గురించి వింటూ ఉంటాం. అవును.. ఇవి మనకి అవసరమే. అయితే ఈ రెండింటికీ మధ్య ఆరోగ్యకరమైన సంబంధం ఉండాలి. మనిషికి భావోద్వేగాలు అన్నవి అత్యంత అవసరం. భావోద్వేగాలతో ముడిపడని తెలివితేటలు ఉన్నా ఉపయోగం లేదు. కేవలం తెలివితేటలతోనే జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్లలేం. ఐక్యూ అనేది మనకు కొంతలో కొంత విజయాన్ని అందించవచ్చు. కానీ, ఈక్యూ అనేది మీకు ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. ఆ లక్ష్యం దిశగా మనం సరైన అడుగులు వేసే విధంగా మన ఆలోచనలను పెంపొందిస్తుంది.

*గురు శిష్యుల మధ్య అవినాభావ సంబంధం ఉండాలి. కానీ ఈ రోజు దురదృష్టవశాత్తు ఆ పరిస్థితి లేదు. ఈ విధానాలు మారాలి. 

Trending News