Monekypox Cases in India: దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళలోని కోజికోడ్‌లో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళలో ఇది ఐదో కేసు కాగా దేశంలో ఏడో కేసు. ఈ నెల 27న యూఏఈ నుంచి తిరిగొచ్చిన 30 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జి తెలిపారు. ప్రస్తుతం అతను మలప్పురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
మంకీపాక్స్ కారణంగా దేశంలో తొలి మరణం కూడా ఇటీవలే కేరళలో నమోదైన సంగతి తెలిసిందే. యూఏఈ నుంచి తిరిగొచ్చిన 22 ఏళ్ల వ్యక్తి మంకీపాక్స్‌తో శనివారం మృతి చెందాడు. కేరళ మంత్రి వీణ జార్జి తాజాగా దీనిపై స్పందిస్తూ... అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాల్సి ఉందన్నారు. సాధారణంగా మంకీపాక్స్ ప్రాణాంతకమేమీ కాదన్నారు. చనిపోయిన ఆ వ్యక్తి ఇతర వ్యాధులతోనూ బాధపడుతున్నట్లు వైద్యులు చెప్పారని తెలిపారు.
కేరళలో గుర్తించిన మంకీపాక్స్ వైరస్ అంత తీవ్రమైనదేమీ కాదని వీణ జార్జి పేర్కొన్నారు. అయితే ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. వ్యాధి వ్యాప్తి వేగవంతమైందంటే అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
కిడ్నీ వ్యాధులు, రోగ నిరోధక శక్తిని తగ్గించే కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారికి మంకీపాక్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని లండన్‌కి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ హేమన్ తెలిపారు. ఆఫ్రికాలో మాత్రమే కనిపించే మంకీపాక్స్ కేసులు ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల్లో వెలుగుచూశాయి. దీంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ మంకీపాక్స్ కారణంగా ముగ్గురు మృతి చెందినట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఈ వ్యాధి జంతువుల నుంచి మనుషులకు వ్యాపించింది. ఈ వ్యాధి బారినపడితే జ్వరం, దద్దుర్లు, కండరాల నొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధికి ప్రత్యేక చికిత్స ఏదీ అందుబాటులో లేనప్పటికీ యాంటీ వైరల్ మందులతో నయం చేయవచ్చు.
Also Read: Sweeper to Manager: ఒకప్పుడు బ్యాంకులో స్వీపర్.. ఇప్పుడు మేనేజర్! ఈ మహిళ సక్సెస్ స్టోరీ ఇదే
Also Read: షూటింగ్స్ బంద్ పై మంచు మౌన వ్రతం.. మిగతా హీరోలు కూడా నోరు విప్పనిది అందుకేనా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook