Dog guards abonded newborn baby girl: కొన్ని సంఘటనల గురించి విన్నప్పుడు మనుషుల కన్నా జంతువులే నయం అనిపిస్తుంటుంది. ఇది కూడా అలాంటి సంఘటనే. ఇంకా పురిటి వాసన కూడా పోని ఓ పసిబిడ్డను (Infant Abonded) గుర్తు తెలియని వ్యక్తులు ఓ నిర్మానుష్య ప్రదేశంలో వదిలి వెళ్లిపోయారు. కన్నవారే బిడ్డ పట్ల ఇంత కర్కషత్వం ప్రదర్శించగా.. ఓ శునకం రాత్రంతా ఆ పసిబిడ్డను కంటికి రెప్పలా కాపాడటం గమనార్హం. ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) ముంగేలీ జిల్లా సరిస్తల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సరిస్తల్ గ్రామంలోని ఓ ప్రదేశంలో ఆ శిశువును గుర్తించారు. ఇంకా బొడ్డు పేగు కూడా కోయకుండానే ఆ పసిబిడ్డను ఎవరో అక్కడ వదిలేసి వెళ్లిపోయారు. ఆ శిశువు ఏడుపు విని కొంతమంది దగ్గరికి వెళ్లి పరిశీలించారు. శిశువుకు (Infant) సమీపంలో కొన్ని వీధి కుక్కలు (Stray dogs) సంచరిస్తుండగా... మరో కుక్క, దాని పిల్లలు ఆ పసిబిడ్డ పక్కనే ఉండటం గమనించారు.
నిజానికి ఆ కుక్క శిశువుకు (Infant) ఏమైనా హాని తలపెట్టిందేమోనని వారు ఆందోళన చెందారు. కానీ కాసేపటికి అర్థమైందేంటంటే... రాత్రి నుంచి ఆ కుక్కనే శిశువుకు కాపలాగా ఉందని గ్రహించారు. వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించగా శిశువును సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆకాంక్ష అనే చైల్డ్ లైన్ సంస్థకు శిశువును తరలించారు.
స్థానిక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా ఈ సంఘటనను (Viral news) తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఈ ఘటన గురించి తెలిసి తాను చాలా బాధపడ్డానని పేర్కొన్నారు. ఆ శిశువును పోలీసులు ఆసుపత్రికి తరలించారని... ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. మగబిడ్డను, ఆడబిడ్డను సమానంగా చూడలేకపోతే... ఆడపిల్లల పట్ల వివక్ష ప్రదర్శించే మనస్తత్వం ఉంటే తల్లిదండ్రులుగా మీరు అన్‌ఫిట్ అని పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
खबर पढ़कर मन व्यथित हो गया.
बच्ची को पुलिस ने अस्पताल पहुंचा दिया है, मामले की छानबीन जारी है.
यदि आप बेटा-बेटी में भेद-भाव की सोच से ग्रस्त हैं तो आप अभिभावक बनने लायक नहीं हैं.
दोषियों को कानून के तहत सख्त सजा मिले. ऐसे पाप रोकें, दकियानूसी सोच त्यागें, बेटा-बेटी एक समान मानें. pic.twitter.com/JDD5tQExSu— Dipanshu Kabra (@ipskabra) December 19, 2021
Also Read: Bank Holiday Alert: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్-డిసెంబర్ చివరి 10 రోజుల్లో ఆరు రోజులు సెలవులే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook