భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబాని తన కొడుక్కి పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంబాని కొడుకు ఆకాష్ అంబాని పెళ్లి అంటే, అతడిని పెళ్లి చేసుకునే వధువు కూడా ఆ రేంజ్‌లోనే వుండాలి కదా మరి!! అందుకే ప్రపంచంలోనే పేరున్న వజ్రాల వ్యాపారి అయిన రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతా అంబాని ఇంటికి కోడలిగా రానుందని సమాచారం. మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ ఇద్దరి నిశ్చితార్థానికి ఇంకెంతో సమయం పట్టకపోవచ్చు. త్వరలోనే ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ పూర్తి చేసి ఈ ఏడాది చివర్లోగా పెళ్లి తతంగం పూర్తి చేయాలని ముఖేష్ అంబాని ప్లాన్ చేసుకుంటున్నట్టు మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ముఖేష్ అంబాని- నీతా అంబాని జంటకు ముగ్గురు సంతానం కాగా ఆకాష్ అంబానితోపాటు జన్మించిన మరో కవల సోదరి ఈషా అంబాని ఆ ముగ్గురిలో పెద్దోళ్లు. ఆకాష్ అంబాని ప్రస్తుతం రిలయన్స్ జియోకు స్ట్రాటెజీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా అతడి సోదరి జియో, రిలయన్స్ రీటేల్ కో-డైరెక్టర్‌గా వున్నారు.