Mulayam singh Yadav: అత్యంత విషమంగా ములాయం సింగ్ ఆరోగ్యం.. అఖిలేశ్ ను పరామర్శించిన సీఎం కెసిఆర్

Mulayam singh Yadav:దేశ రాజకీయ దిగ్గజాల్లో ఒకరైన ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, అఖిలేశ్ యాదవ్ కు సిఎం కెసిఆర్ ఫోన్ చేసి ములాయం యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

Written by - Srisailam | Last Updated : Oct 3, 2022, 04:59 PM IST
  • విషమంగా ములాయం సింగ్ ఆరోగ్యం
  • ఐసీయూకి తరలించి చికిత్స
  • అఖిలేశ్ కు సీఎం కెసిఆర్ పరామర్శ
Mulayam singh Yadav: అత్యంత విషమంగా ములాయం సింగ్ ఆరోగ్యం.. అఖిలేశ్ ను పరామర్శించిన సీఎం కెసిఆర్

Mulayam singh Yadav:సమజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. 82 ఏళ్ల ములాయం  కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆగస్టు 22 నుంచి గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు,.  ఆంకాలజిస్టులు డాక్టన్ నితిన్ సూద్, డాక్టర్ సుశీల్ కటారియాల పర్యవేక్షణలో ఐసీయూలో ములాయంకు చికిత్స అందిస్తున్నారు.అయితే ఆదివారం రాత్రి ములాయం ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ములాయం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కుమారుడు, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్  ఆసుపత్రికి చేరుకున్నారుములాయం   మూత్రనాళ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారనీ, దానికి తోడు వయస్సుతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయనీ  వైద్యులు తెలిపారు.  

ములాయంసింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి గురించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు ఆరా తీసారు. ములాయం సింగ్ కుమారుడు, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, అఖిలేశ్ యాదవ్ కు సిఎం కెసిఆర్ స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. ములాయం యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దసరా తర్వాత తాను స్వయంగా వచ్చి కలుస్తానని సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ కు తెలిపారు.

దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ములాయం సింగ్ యాదవ్ మూడు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.  ప్రస్తుతం మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు. నేతాజీ అని పిలవబడే ములాయం యాదవ్.. తొలిసారిగా 1967లో ఉత్తరప్రదేశ్ శాసనసభలో శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.ములాయం త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ దాస్ మౌర్య అన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా ములాయం ఆరోగ్య పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.  

Read also: CM Kcr: ఈనెల 5న గులాబీ షో..ఏం జరగబోతోందని సర్వత్రా ఉత్కంఠ..!

Read also: Revanth Reddy: యూపీఏను చీల్చడానికే జాతీయ పార్టీ..సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి ధ్వజం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News