Mumbai local: ముంబైకర్ల జీవితంలో ఓ భాగం..అందుకే ట్రైన్‌కు మోకరిల్లి దండం పెట్టాడు ఆ యువకుడు

Mumbai local: ఆ లోకల్ ట్రైన్స్ వారికి జీవనాధారం..జీవితంలో ఓ భాగం. ట్రైన్స్ అనేకంటే లైఫ్‌లైన్స్ అనడం మంచిది. అందుకే ఆ రైళ్లు తిరిగి ప్రారంభమైనప్పుడు మనస్సు హత్తుకునే ఓ దృశ్యం కంటపడింది. 

Last Updated : Feb 3, 2021, 09:40 PM IST
Mumbai local: ముంబైకర్ల జీవితంలో ఓ భాగం..అందుకే ట్రైన్‌కు మోకరిల్లి దండం పెట్టాడు ఆ యువకుడు

Mumbai local: ఆ లోకల్ ట్రైన్స్ వారికి జీవనాధారం..జీవితంలో ఓ భాగం. ట్రైన్స్ అనేకంటే లైఫ్‌లైన్స్ అనడం మంచిది. అందుకే ఆ రైళ్లు తిరిగి ప్రారంభమైనప్పుడు మనస్సు హత్తుకునే ఓ దృశ్యం కంటపడింది. 

దేశ ఆర్ధిక రాజధాని ముంబై ( Mumbai ) కు లైఫ్‌లైన్ ( Lifeline ) లాంటిది లోకల్ ట్రైన్. అవును నిజంగా స్థానికత ముడిపడి ఉంటుంది అందులో. జీవితంలో ఓ భాగమై..జీవనాధారమై..బతుకుబండి లాగేందుకు సహకరిస్తుంటాయి. ఆ బతుకు బండి కరోనా సంక్షోభం కారణంగా 11 నెలలుగా దూరమైంది. బతుకు ఛిద్రమైపోయింది. తిరిగి ఆ లోకల్ ట్రైన్స్  ( Mumbai local trains ) ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమైనప్పుడు మనస్సు హత్తుకునే ఘటన చోటుచేసుకుంది. 11 నెలల అనంతరం ప్రత్యక్షమైన లోకల్ ట్రైన్ చూసి ఓ యువకుడు బావోద్వేగానికి లోనయ్యాడో..కృతజ్ఞత గుర్తొచ్చిందో మరి..ట్రైన్‌కు మోకరిల్లి..దండం పెట్టాడు. ఎవరు క్లిక్ చేశారో గానీ..సోషల్ మీడియా సాక్షిగా వైరల్ అవుతోంది ఈ ఫోటో. ముంబై లోకల్ ట్రైన్ అనేది ఓ ప్రయాణ సాధనం కాదు..ఒక భావోద్వేగమంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. 

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ( Anand Mahindra ) ను సైతం ఈ ఫోటో ఆకర్షించింది. వెంటనే రీట్వీట్ చేస్తూ ఇలా రాశారు. ఇదే కదా భారత్ ఆత్మ..మరోసారి మనకు ఇలా జరగకూడదని ప్రార్ధిస్తున్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చారు. నిజంగానే ఇదొక భావోద్వేగపు ఘటన. ముంబై లోకల్ ట్రైన్స్ ( Mumbai local trains ) అక్కడి జనంలో ఎంతలా భాగమయ్యాయో తెలిపేందుకు..కళ్లకు కట్టినట్టు చూపించే ఓ అరుదైన దృశ్యం ఆ ఫోటో. అందుకే అంతలా వైరల్ అవుతోంది.

Also read: Defamation case on Arnab: అర్నాబ్ గోస్వామిపై పరువు నష్టం దావా వేసిన పోలీసు అధికారి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News