Corona Update: ముంబయిలో కొవిడ్​ కల్లోలం.. కొత్తగా 6,347 మందికి పాజిటివ్​

Corona Update: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కొవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. కొత్తగా ఇక్కడ ఒక్క రోజులోనే 6 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2022, 07:41 PM IST
  • ముంబయిలో కొవిడ్ విజృంభణ
  • కొత్తగా 6 వేలపైన కేసులు
  • కేరళ, ఢిల్లీలోనూ భారీ వృద్ధి
  • ముంచుకొస్తున్న థార్డ్​వేవ్​ భయాలు
Corona Update: ముంబయిలో కొవిడ్​ కల్లోలం.. కొత్తగా 6,347 మందికి పాజిటివ్​

Corona Update: దేశంలో కరోనా కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో (Corona in India) పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీలో తీవ్రత అధికంగా ఉంది.

ముంబయిలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు..

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కరోనా తీవ్రరూపం దాల్చుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ నగరంలో 6,347 కొవిడ్ కేసులు వెలుగు చుశాయి. ఒకరు కొవిడ్​తో మరణించారు. డిసెంబర్ 31న ముంబయిలో 5,631 కరోనా కేసులు నమోదవడం (Corona cases in Mumbai) గమనార్హం.

ఒక్క ముంబయిలోనే 22,334 యాక్టివ్​ కరోనా కేసులు ఉన్నట్లు ముంబయి మున్సిపల్ విభాగం​ వెల్లడించింది. న్యూ ఇయర్​ సెలెబ్రేషన్స్​పై నిషేధం విధించిన, కర్ఫ్యూ వంటి నియంత్రణ చర్యలు చేపట్టినా ముంబయిలో కేసులు ఈ స్థాయిలో పెరుగుతుండటం ఆందోళనకరమైన విషయం.

ఢిల్లీలో 51 శాతం పెరిగిన కేసులు..

ఢిల్లీలో కూడా కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 2,716 మందికి పాజిటివ్​గా తేలింది. నిన్నటితో పోలిస్తే కొత్త కేసులు 51 శాతం పెరిగాయి. ఢిల్లీ వ్యాప్తంగా మొత్తం 3,360 యాక్టివ్ కేసులు (Corona cases in Delhi) ఉన్నాయి.

కేరళలో 22 మంది కొవిడ్​కు బలి

కేరళలో సైతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. నేడు 2,435 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 22 మంది కరోనాతో మృతి చెందినట్లు తెలిపింది. ఇక రాష్ట్రంలో మొత్తం 18,904 యాక్టివ్​ కేసులు (Corona cases in Kerala) ఉన్నట్లు వివరించింది.

కర్ణాటకలో ఇలా..

కర్ణాటకలో కరోనా కేసులు మరోసారి వెయ్యి దాటాయి. కొత్తగా 1,033 పాజిటివ్​ కేసులు (Corona cases in Karnataka) నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య విభాగం తెలిపింది. యాక్టివ్​ కేసులు 9,386కు పెరిగినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 38,340 మంది కొవిడ్​ కారణంగా మృతి చెందారు.

వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం.. వీటికి తోడు ఒమిక్రాన్​ వేరియంట్​ (Omicron fears in India) భయాలు దేశంలో థార్డ్​వేవ్ సంకేతాలకు ఊతమందిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు.

Also read: Covid new symptoms : ఈ లక్షణాలు ఉంటే కరోనా అని గుర్తుంచుకోండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

Also read: Haryana Landslide : మైనింగ్ క్వారీలో ఘోర ప్రమాదం.. శిథిలాల కింద చాలా వాహ‌నాలు, పలువురి మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News