Pharma Pricing: కరోనా మహమ్మారి సమయంలో అత్యవసర మందులే కాదు సాధారణ వైద్య పరికరాల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. డిమాండ్ ఆధారంగా ఇష్టారాజ్యంగా ధరలు పెంచుకున్నారు వ్యాపారులు. అందుకే ఆ పరికరాల ధరలపై నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా మహమ్మారి(Corona Pandemic)సమయంలో వైద్యం అందని ద్రాక్షగా మారిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. పరీక్షల నుంచి చికిత్స వరకూ, మందుల నుంచి వైద్య పరికరాల ధరల వరకూ అన్నీ పెరిగిపోయాయి. సామాన్యుడికి చుక్కలు చూపించాయి. మార్కెట్లో ఉన్న డిమాండ్ ఆధారంగా ఇష్టారాజ్యంగా ధరల్ని పెంచేశారు వ్యాపారులు. వాస్తవ ధర కంటే 2-3 రెట్లు అధికంగా వసూలు చేశారు. మరీ ముఖ్యంగా పల్స్ ఆక్సీమీటర్, నెబ్యులైజర్, డిజిటల్ థర్మామీటర్, గ్లూకోమీటర్, బీపీ మానిటర్ మిషన్ ధరలు అసాధారణంగా పెరిగిపోయాయి.ఈ క్రమంలో నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ వైద్య పరికరాలపై (Medical Devices)మార్జిన్‌ను 70 శాతానికి పరిమితం చేస్తూ ఎన్‌పీపీఏ(NPPA)ఉత్తర్వులు జారీ చేసింది. తయారీ, దిగుమతి, మార్కెటింగ్ కంపెనీల్నించి సేకరించిన సమాచారం ప్రకారం ఈ వైద్య పరికరాల విక్రయంలో 709 శాతం లాభాలు ఆర్జిస్తున్నారని తేలింది. జూలై 20 నుంచి కొత్త ఉత్తర్వులు అమల్లో రానున్నాయి. ఔషధాల ఉత్తర్వు - 2013 ప్రకారం ప్రభుత్వాదేశాల్ని ఉల్లంఘిస్తే..అధికంగా వసూలు చేసిన మొత్తానికి 15 శాతం వార్షిక వడ్డీతో పాటు 10 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎన్‌పీపీఏ తాజా ఉత్తర్వులతో ఇక ఈ వైద్య పరికరాల ధరలు(Pharma Devices)తగ్గనున్నాయి.
Also read: PM Meet: కరోనా థర్డ్‌వేవ్ ముప్పు, ఆరు రాష్ట్రాల సీఎంలతో ఈ నెల 16న ప్రధాని మోదీ భేటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook