Indira Gandhi Prize: డేవిడ్‌ బోరోకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి

ప్రముఖ ప్రకృతి శాస్త్రవేత్త, బ్రిటిష్ బ్రాడ్‌కాస్టర్‌ డేవిడ్‌ అటెన్‌బోరో (David Attenborough)కు మరో అవార్డు దక్కింది. డేవిడ్‌ అటెన్‌ బోరో.. 2019 సంవత్సరానికి గానూ ఇందిరా గాంధీ శాంతి పురస్కారాన్ని ( Indira Gandhi Prize Award 2019) అందుకున్నారు.

Last Updated : Sep 8, 2020, 10:09 AM IST
Indira Gandhi Prize: డేవిడ్‌ బోరోకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి

David Attenborough awarded indira gandhi peace prize: న్యూఢిల్లీ: ప్రముఖ ప్రకృతి శాస్త్రవేత్త, బ్రిటిష్ బ్రాడ్‌కాస్టర్‌ డేవిడ్‌ అటెన్‌బోరో ( David Attenborough ) కు మరో అవార్డు దక్కింది. డేవిడ్‌ అటెన్‌ బోరో.. 2019 సంవత్సరానికి గానూ ఇందిరా గాంధీ శాంతి పురస్కారాన్ని ( Indira Gandhi Prize Award 2019) అందుకున్నారు. వర్చువల్‌‌గా జరిగిన ఈ కార్యక్రమంలో డేవిడ్ అటెన్‌బోరోకు మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌ ఈ శాంతి బహుమతిని ప్రదానం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం, జీవవైవిధ్యాన్ని కాపాడటానికి బోరో దశాబ్దాలుగా కృషిచేస్తున్నారు. అయితే.. శాంతి, నిరాయుధీకరణ, ప్రకృతి పరిరక్షణ-అభివృద్ధి కోసం బోరో చేసిన కృషికిగానూ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. Also read: Unlock-4: ఈ నెల 21 నుంచి తాజ్‌మహల్‌ సందర్శనకు అనుమతి

వర్చువల్ ద్వారా జరిగిన ఈ కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ.. జీవవైవిధ్యాన్ని కాపాడటానికి బోరో చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఆయన పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. అయితే.. శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నవారికి 1986నుంచి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జ్ఞాపకార్థంగా శాంతి బహుమతిని ప్రదానం చేస్తున్నారు. ఈ మేరకు 25 లక్షల నగదుతోపాటు.. ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు.  Also read: India-China standoff: భారత్-చైనా సైన్యం మధ్య కాల్పులు..!

Trending News