Personnel shortage in the armed forces: ఆర్మీలో ఆఫీసర్ స్థాయిలో (Army vacant posts) 7,476 పోస్ట్‌లు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. అదే విధంగా నేవీలో (Navy vacant posts) 621, ఎయిర్‌ఫోర్స్‌లో (IAF vacant posts) 1,265 పోస్ట్‌లు ఖాళీలు ఉన్నాయని తెలిపింది. రాజ్య సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానంలో ఈ వివరాలు పేర్కొన్నారు.
మొత్తం పోస్ట్‌ల పరంగా ఆర్మీలో అత్యధిక ఖాళీలు ఉన్నట్లు చెప్పారు అజయ్ భట్(Minister of State for Defence Ajay Bhatt), ఆర్మీలో మొత్తం 97,177 ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. అన్ని రెజిమెంట్లలో కొరత ఉందని చెప్పుకొచ్చారు. నేవీలో 11,166 పోస్ట్‌లు ఖాళీగా ఉండగా.. ఎయిర్‌ఫోర్స్‌లో 4,850 పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయని వివరించారు.
ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు భట్.
యువతకు అవగాహన..
సాయుధ దళాలాలో చేరేలా యువతను ప్రోత్సహించేందుకు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలిపారు అజయ్ భట్. స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థల్లో మోటివేషన్ క్లాస్‌లు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు
47 రిక్రూట్మెంట్ ర్యాలీలు..
2020-21 రిక్రూట్మెంట్ సంవత్సరంలో 47 ర్యాలీలు నిర్వహించినట్లు చెప్పారు భట్. ఇదే సమయంలో నేవీ ఒక బ్యాచ్ సెయిలర్ల రిక్రూట్మెంట్ చేపట్టినట్లు వెల్లడించారు. అదే విదంగా ఐఏఎఫ్ కూడా రిక్రూట్మెంట్ చేపట్టినట్లు స్పష్టం చేశారు. కొవిడ్ సంక్షోభం కారణంగా కొన్ని రిక్రూట్మెంట్లు ఆగిపోయినట్లు వివరించారు.
Also read: Nagaland firing: 'నాగాలాండ్ కాల్పుల ఘటన పొరపాటు- బాధ్యులపై చర్యలు తీసుకుంటాం'
Also read: Omicron cases in India: మహారాష్ట్రలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook