New Year 2021 నుంచి నూతన నియమాలు

New Year Changes : కరోనావైరస్ మహమ్మారి సమయంలో కొత్త సంవత్సరం వేడుకలు ఈ సారి కాస్త వెరైటీగా సెలబ్రేట్ చేయబోతున్నాం. జనవరి 1వ తేదీ నుంచి సంవత్సరంతో పాటు చాలా విషయాలు మారిపోనున్నాయి. 

Last Updated : Dec 23, 2020, 09:08 AM IST
    1. కరోనావైరస్ మహమ్మారి సమయంలో కొత్త సంవత్సరం వేడుకలు ఈ సారి కాస్త వెరైటీగా సెలబ్రేట్ చేయబోతున్నాం.
    2. జనవరి 1వ తేదీ నుంచి సంవత్సరంతో పాటు చాలా విషయాలు మారిపోనున్నాయి.
New Year 2021 నుంచి నూతన నియమాలు

New Year 2021 : కరోనావైరస్ మహమ్మారి సమయంలో కొత్త సంవత్సరం వేడుకలు ఈ సారి కాస్త వెరైటీగా సెలబ్రేట్ చేయబోతున్నాం. జనవరి 1వ తేదీ నుంచి సంవత్సరంతో పాటు చాలా విషయాలు మారిపోనున్నాయి. మొబైల్, కారు, ట్యాక్స్, ఎలక్ట్రిషియన్, రోడ్డు, బ్యాంకింగ్ వంటి ఎన్నో అంశాల్లో మార్పు కనిపించనున్నాయి. వీటి గురించి ఇప్పటి నుంచే సిద్ధం అవడం ముఖ్యం.

Also Read | Post Office ఖాతాదారులకు షాక్..ఇలా చేయకపోతే ఎకౌంట్ క్లోజ్

నూతన సంవత్సరం 2020 ఈ సారి ఎన్నో మార్పులను తీసుకురానుంది. ఇంట్లో కేలండర్‌తో పాటు ఎన్నో బాధ్యతలు కూడా మారనున్నాయి. జీవితంతో ముడిపడి ఉన్న ఎన్నో అంశాల్లో మార్పురానుంది. 

ఫాస్టాగ్ తప్పనిసరి
వాహనాల్లో జనవరి 1వ తేదీ నుంచి ఫాస్టాగ్ ఉండటం తప్పనిసరి కానుంది. ఫాస్టాగ్ (FASTag) లేనిదే నేషనల్ హైవేపై కారు నడిపే వారికి డబుల్ చార్జీలు వసూలు చేస్తారు.
పెట్టుబడుల విషయంలో
మల్టీ  క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ విషయంలో అసెట్ ఎలోకేషన్ నియమాలను మార్చింది.  కొత్త నియమాల ప్రకారం ఫండ్స్‌లో 75 శాతం ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడం అవసరం.

Also Read | Post Office Account: పోస్టాఫిస్ డూప్లికేట్ పాస్‌బుక్, చెక్‌బుక్ సర్వీసు చార్జీలు
యూపిఐ
జనవరి 1వ తేదీ నుంచి గూగుల్ పే, ఫోన్ పే చేయాలి అంటే వారికి ఎక్స్‌ట్రా పే చేయాల్సి ఉంటుంది.  కొత్తగా NPCI 1వ తేదీ నుంచి థర్డ్ పార్టి యాప్ ప్రొవైడర్స్ ద్వారా నడిచే యూపిఐ సేవలకు (UPI Payment) చార్జీలు వసూలు చేయనున్నారు.
జీరో కలిపి...
దేశ వ్యాప్తంగా మొబైల్ ఫోన్స్‌పై ల్యాండ్‌లైన్స్ నుంచి ఫోన్ చేయాలి అంటే ఇకపై ముందు సున్నాను యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు TRAI మే 29,2020 ఒక ప్రకటన విడుదల చేస్తూ జనవరి 1వ, 2020  నుంచి అమలులోకి వస్తుంది తెలిపింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News