Free Ration to Poor: పేదలకు కేంద్రం న్యూ ఇయర్ గిఫ్ట్.. మరో ఏడాది ఫ్రీ

Free Ration to Poor People For One Year: న్యూ ఇయర్ సందర్భంగా పేదలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తామని కేబినెట్ సమావేశం అనంతరం ఆహార మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గడువును పొడిగించడానికి ప్రభుత్వం నిరాకరించింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2022, 11:38 PM IST
Free Ration to Poor: పేదలకు కేంద్రం న్యూ ఇయర్ గిఫ్ట్.. మరో ఏడాది ఫ్రీ

Free Ration to Poor People For One Year: ఊహగానాలకు తెరపడింది. రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 81.3 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ సమయాన్ని మరో ఏడాది పొడిగించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద పేదలకు ఉచితంగా రేషన్ ఇవ్వడానికి సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని.. ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. శుక్రవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద 81.35 కోట్ల మంది పేదలకు ఏడాదిపాటు ఉచిత రేషన్ అందించాలని కేబినెట్‌లో నిర్ణయించారు. 81.3 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాల పంపిణీకి వెచ్చించిన రూ.2 లక్షల కోట్ల ఆర్థిక భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించేందుకు మంత్రిమండలి ఒకే చెప్పింది.  

ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తామని కేబినెట్ సమావేశం అనంతరం ఆహార మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అయితే డిసెంబర్ 31తో ముగియనున్న ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) గడువును పొడిగించేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 81.35 కోట్ల మందికి ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందిస్తోంది. ఈ పథకం కింద లభించే ధాన్యం.. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద లభించే సబ్సిడీ ధాన్యానికి భిన్నంగా ఉంటుంది. మొత్తమ్మీద ఇంతకుముందు ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద రేషన్ షాపులో పేదలు కిలో రూ.2 నుంచి 3కి కొనుగోలు చేసే ఆహార ధాన్యాలను మరో ఏడాదిపాటు ఉచితంగా అందించనుంది.

ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద పేదలకు కిలో బియ్యం రూ.3, గోధుమలు కిలో రూ.2 చొప్పున లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పేదలకు నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వ పెద్దలు అభివర్ణించారు. ఈ పథకం కింద ఇప్పుడు లబ్ధిదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

Also Read: IPL Mini Auction: సెహ్వాగ్ మేనల్లుడుపై కాసుల వర్షం.. వేలంలో దక్కించుకున్న సన్‌రైజర్స్  

Also Read: Nasal Vaccine: కొత్త వేరియంట్ భయందోళనలు.. బూస్టర్ డోస్ నాజల్ వ్యాక్సిన్ వచ్చేసింది..   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News