న్యూఢిల్లీ: నిర్భయ రేప్ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ కుమార్ శర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. నిర్భయ కేసులో దోషులుగా ఉన్న నలుగురికి ఇటీవల ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 22న ఉదయం 7 గంటలకు నలుగురు దోషులైన వినయ్, పవన్ గుప్త, ముఖేష్ సింగ్, అక్షయ్ థాకూర్లకు ఉరి శిక్ష అమలు చేయాల్సిందగా పటియాలా హౌజ్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి సతీష్ కుమార్ అరోరా జనవరి 7న తీర్పు ఇచ్చారు. అయితే, ఆలోగా దోషులకు ఉండే హక్కులకు అనుగుణంగా వారికి ఉండే చట్టపరమైన అవకాశాలను వినియోగించుకోవచ్చని కోర్టు స్పష్టంచేసింది. దీంతో వినయ్ శర్మ తరపు న్యాయవాది సుప్రీం కోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు.
శిక్ష పడిన ఖైదీలకు న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ఉండే జుడిషియల్ పరిధిలో ఉండే చిట్టచివరి అవకాశమే ఈ క్యురేటివ్ పిటిషన్. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..