సీఆర్పీఎఫ్ ఎస్ఐ ఆత్మహత్య

హైదరాబాద్‌లో దారుణం జరిగింది.  జూబ్లీహిల్స్‌లో ఓ సీఆర్‌పీఎఫ్ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారు. కొద్దికాలంగా CRPF SIగా పని చేస్తున్న భవానీ శంకర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Last Updated : Mar 19, 2020, 10:54 AM IST
సీఆర్పీఎఫ్ ఎస్ఐ ఆత్మహత్య

హైదరాబాద్‌లో దారుణం జరిగింది.  జూబ్లీహిల్స్‌లో ఓ సీఆర్‌పీఎఫ్ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారు. కొద్దికాలంగా CRPF SIగా పని చేస్తున్న భవానీ శంకర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. 

Read Also:నిర్భయ కేసులో మరో ట్విస్ట్

భవానీ శంకర్ జూబ్లీహిల్స్‌ సీఆర్పీఎఫ్ క్వార్టర్స్‌‌లోని వినోద గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు.  ఐతే ఆయన ఆత్మహత్యకు కారణాలు ఏంటనేది తెలియ రావడం లేదు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భవానీ శంకర్ కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశారు. కుటుంబ సభ్యులు తెలిపే వివరాలను బట్టి.. ఆయన ఆత్మహత్యకు కారణాలేంటనేది తెలిసే అవకాశం ఉంది. మరోవైపు ఆయన గదిలో సూసైడ్ నోట్ ఏమైనా రాశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. .జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.

Trending News