ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ కోటా ఇవ్వడం కుదరదని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ప్రభుత్వోద్యోగాల ప్రమోషన్ పై 2006 తీర్పును పున:సమీక్షించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
దీన్ని విచారణ చేసిన ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయడం కుదరదని వెల్లడించింది. అంతేకాదు 2006లో ఎం. నాగరాజ్ కేసులో బెంచ్ ఇచ్చిన తీర్పును పునఃపరిశీలనకు ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం అవసరం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో సమాచారం సేకరించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. గతంలో అన్ని వాదనలు విన్న సుప్రీం.. ఆగస్టు 30న తీర్పు రిజర్వ్ లో ఉంచి.. నేడు తీర్పు వెలువరించింది.
2006లో ఇచ్చిన తీర్పుపై అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీర్పును పునఃపరిశీలించాలంటూ కోర్టును ఆశ్రయించాయి. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు వెనకబడి ఉన్నారు కాబట్టి వారి కులాన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగాల్లో పదోన్నతులు కల్పించాలని కోర్టును ఆశ్రయించాయి. కేంద్రం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదించారు. ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్ ఇవ్వరాదన్న పిటిషనర్ తరపున వాదించారు సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది.
Supreme Court says there is no need to collect data on SC/ST in reservation in promotion in government services https://t.co/4S6zBTrPcy
— ANI (@ANI) September 26, 2018
SC/ST reservations in promotion: Supreme Court's five-judge bench refuses to refer the Nagaraj judgement to a larger bench pic.twitter.com/ADWZIoMgba
— ANI (@ANI) September 26, 2018