Metro Recruitment 2024: మెట్రోలో భారీ రిక్రూట్మెంట్‌.. రూ.2.8 లక్షల జీతం వెంటనే అప్లై చేయండి..

Noida Metro Recruitment 2024: మెట్రోలో భారీ రిక్రూట్మెంట్‌ విడుదల అయింది. జనరల్‌ మేనేజర్‌ (ఆపరేషన్‌) రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2024 డిసెంబర్‌ 19 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌ nmrcnoida.com ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Written by - Renuka Godugu | Last Updated : Nov 27, 2024, 12:20 PM IST
Metro Recruitment 2024: మెట్రోలో భారీ రిక్రూట్మెంట్‌.. రూ.2.8 లక్షల జీతం వెంటనే అప్లై చేయండి..

Noida Metro Recruitment 2024: రైల్వే జాబ్‌ మీ కల అయితే, మెట్రో నుంచి బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. దీనికి సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో మీరు లక్షల్లో జీతం పొందవచ్చు. మీకు ఉన్న అనుభవం సరిపోతే సింపుల్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు.  మెట్రో భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంపికైతే రూ. 2.5 లక్షల జీతం పొందవచ్చు. మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తు స్వీకరణ చేపట్టింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్‌ 19 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. నోయిడా మెట్రో అధికారిక వెబ్‌సైట్‌ nmrcnoida.com ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే నోటిఫికేషన్‌ క్షుణ్నంగా చదవాలి. అప్లికేషన్‌ పూర్తిగా నమోదు చేసిన తర్వాత సంబంధిత పత్రాలను కూడా చివరితేదీలోగా అడ్రస్‌కు పంపించాలి. దీన్ని స్పీడ్‌ పోస్ట్‌ లేదా కొరియర్‌లో పంపించవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం అందుబాటులో లేదు.

వయో పరిమితి..
నోయిడా మెట్రో రిక్రూట్మెంట్‌ 2024 కు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 56 ఏళ్లు మించకూడదు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు పోస్టులకు ఎంపికైతే వారికి రూ.1,20,000 నుంచి రూ.2,80,000 వరకు జీతం అందుకుంటారు.

అర్హత..
నోయిడా మెట్రో రిక్రూట్మెంట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుఉలు డిగ్రీ లేదా తాత్సమానంలో ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, టెలికామ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌ ప్రభుత్వం గుర్తింపు పొందిన యునివర్శిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి పట్టా పొంది ఉండాలి.

కావాల్సిన అనుభవం...
నోయిడా మెట్రో రిక్రూట్మెంట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 17 ఏళ్లు గ్రూప్‌ 'ఏ' లేదా ఎగ్జిక్యూటీవ్‌ ఎక్స్‌పీరియనస్‌ మెట్రో రైల్‌లో కలిగి ఉండాలి. రైల్వే, ఆర్‌ఆర్‌టీఎస్‌ ఆపరేషన్స్‌, ఆపరేషనల్‌ సేఫ్టీ అండ్‌ ఆపరేషనల్‌ ట్రైనింగ్‌ పొంది ఉండాలి.

ఎంపిక విధానం..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను అర్హత, అనుభవం ప్రకారం ఎంపిక చేస్తారు. షార్ట్‌ లిస్ట్‌ చేసి అభ్యర్థులను ఎంపిక విధాన ప్రక్రియకు ఆహ్వానిస్తారు. అందులో రాత పరీక్ష లేదా పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో వారి నైపుణ్యతకు పరీక్ష ఉంటుంది. అనుభవం, స్కిల్‌, ఫిజికల్‌ ఎబిలిటీకి సంబంధించి ఉంటాయి.

ఇదీ చదవండి: పనిప్రదేశంలో స్ట్రెస్‌కు గురవుతున్నారా? ఈ టాప్‌ 5 చిట్కాలతో చెక్‌ పెట్టండి..

కావాల్సిన ధ్రువ ప్రతాలు..
మీ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ధ్రువపత్రాల కాపీలు
అపాయింట్‌మెంట్‌ లెట్టర్‌, జాయినింగ్‌ లెట్టర్‌, ఇంక్రిమెంట్‌ లెట్టర్‌, ప్రమోషన్‌ లెట్టర్‌, ప్రస్తుత పే స్కేలు కు సంబంధించిన ఆఫీస్‌ ఆర్డర్ ప్రస్తుత పే స్కేల్‌కు సంబంధించిన పే స్కేల్‌ ప్రమోషన్‌ లెట్టర్‌ కూడా కలిగి ఉండాలి.
సర్వీస్‌ సర్టిఫికేట్‌ లేదా అనుభవ ధ్రువపత్రం ప్రస్తుత ఉద్యోగంతోపాటు గతంలో పనిచేసిన సర్టిఫికేట్లు.
పే స్లిప్‌ చివరి మూడు నెలలకు సంబంధించిన పత్రాలు
ఎన్‌ఓసీ, విజిలెన్స్‌ క్లియరెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి.‌ 

ఇదీ చదవండి: మీ రూమ్‌కు సరిపోయే పర్ఫెక్ట్‌ రూమ్‌ హీటర్‌ ఎలా ఎంచుకోవాలి? ఈ 3 చిట్కాలు ముందుగానే తెలుసుకోండి..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News