నేను మీకు ప్రధానిగా చెప్తున్నా:కర్ణాటక పర్యటనలో మోదీ

ప్రభుత్వం శాస్త్రవేత్తల పట్ల వారి ఆవిష్కరణలు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. దేశంలోని ఉత్తమ శాస్త్రీయ ఆవిష్కరణలు, ప్రపంచానికి మార్గం చూపే ఆలోచనలు ఈ రోజు DRDO లో ఉన్నాయని,దాని విజయాలు లెక్కించలేనివని కొనియాడారు. ఈ దశాబ్దం భారతదేశానికి కీలకమైనదని, వచ్చే దశాబ్దంలో భారతదేశం పరిస్థితుల్ని, ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

Last Updated : Jan 3, 2020, 01:51 PM IST
నేను మీకు ప్రధానిగా చెప్తున్నా:కర్ణాటక పర్యటనలో మోదీ

బెంగళూరు: ప్రభుత్వం శాస్త్రవేత్తల పట్ల వారి ఆవిష్కరణలు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. దేశంలోని ఉత్తమ శాస్త్రీయ ఆవిష్కరణలు, ప్రపంచానికి మార్గం చూపే ఆలోచనలు ఈ రోజు DRDOలో ఉన్నాయని, దాని విజయాలు లెక్కించలేనివని కొనియాడారు. ఈ దశాబ్దం భారతదేశానికి కీలకమైనదని, వచ్చే దశాబ్దంలో భారతదేశం పరిస్థితుల్ని, ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. మనం ఆలోచించడం మానేయకూడదని ఆవిష్కరణలు వస్తూనే ఉండాలని, భారతీయ విజ్ఞాన సంస్థలు పరిశోధన నిలయాలు,ప్రపంచంలో ఉన్నటువంటి వాటికి మన DRDO లాంటి పరిశోధన సంస్థలు ఆదర్శం కావాలని అన్నారు. ప్రధానిగా మీకు నేను సహకరించడం ముందుంటానని శాస్త్రవేత్తలతో ముచ్చటించారు. 

కర్ణాటకలోని తూమకూర్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ''వచ్చే ఐదేళ్లలో భారత్‌ ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్ధగా ఎదగాలంటే వ్యవసాయం కీలక పాత్ర పోషించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఎగుమతి ఆధారిత వ్యవస్ధగా సేద్యాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని వెల్లడించారు. సుగంధద్రవ్యాల సాగు, ఎగుమతులను పెంచడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉందని చెప్పుకొచ్చారు. తమ హయాంలో దేశవ్యాప్తంగా సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి 25 లక్షల టన్నులకు పెరగ్గా, ఎగుమతులు రూ. 15,000 కోట్ల నుంచి రూ. 19,000 కోట్లకు పెరిగాయని చెప్పారు. రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి మెరుగైన భవిష్యత్‌ కోసం కేంద్ర ప్రభుత్వం పాటుపడుతోందని తెలిపారు. రైతులు తమ పంటను దాచుకునేందుకు కోల్డ్‌ స్టోరేజ్‌ సదుపాయాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకువస్తోందని చెప్పారు.

తూమకూరులో జరిగిన కృషి కర్మన్ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయన్నారు. తాము ఇస్తున్న నిధులు పూర్తిస్థాయిలో వినియోగమవుతున్నాయన్నారు. గత ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తే అందులో 80 శాతానికి పైగా దళారుల జేబుల్లోకి వెళ్లేవని తాము వచ్చాక ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశామన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..   
 

Trending News