SSC Jobs: పదోతరగతి అర్హతతో 25వేల పోస్టులు..రేపే చివరి తేది..త్వరగా అప్లై చేయండి!

SSC Jobs: ప్రభుత్వ కొలువు సాధించాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే నిరుద్యోగుల కోసం గత నెలలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఈ పోస్టులు అప్లై చేసుకోవడానికి రేపటితో గడువు ముగియనుంది. ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకుండా అప్లై చేసేయండి మరి. వివరాల్లోకి వెళితే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 30, 2021, 03:33 PM IST
SSC Jobs: పదోతరగతి అర్హతతో 25వేల పోస్టులు..రేపే చివరి తేది..త్వరగా అప్లై చేయండి!

SSC Jobs: ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం ద్వారా జీవితంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) గత నెలలో శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. పదో తరగతి/తత్సమాన అర్హతతో భారీ మొత్తంలో ఉద్యోగాల(Jobs) భర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 

ఈ క్రమంలో బీఎస్ఎఫ్, సీఐఎస్‌ఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ, ఏఆర్, ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్ తదితర విభాగాల్లో సుమారు 25వేల కానిస్టేబుల్ జీడీ(జనరల్ డ్యూటీ) పోస్టులకు గత నెల 17న దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కాగా.. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి రేపే (31-08-2021) చివరి తేది అయినందు వల్ల ఇంకా అప్లై చేసుకోనటువంటి అభ్యర్థులు (యువతి/యువకులు) దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రణాళికాబద్ధంగా ప్రిపేరై, కలలు కన్న ఉద్యోగాన్ని సాధించి జీవితంలో స్థిరపడొచ్చు. 

Also Read: నిరుద్యోగులకు శుభవార్త: ఏపీ విద్యుత్‌ సంస్థలో 398 ఉద్యోగ ఖాళీలు..దరఖాస్తులు ఎప్పటి నుంచంటే..!

నోటిఫికేషన్‌ పరిశీలిస్తే..

మొత్తం ఖాళీలు: 25,271
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీకి సంబంధించిన పదోతరగతి/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత సర్టిఫికేట్ ఉండాలి
అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థలకు రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్విస్‌మ్యాన్ కేటగిరీకి చెందిన వారికి అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. 
అప్లికేషన్ ఫీజుకు చివరి తేది: ఆన్‌లైన్ ద్వారా 02-09-2021 (23:30) తేదీ వరకు చెల్లించాలి. ఆఫ్‌లైన్ ద్వారా అయితే 04-09-2021 (23:30) తేదీ వరకు చెల్లించొచ్చు.
వయసు: 18 నుంచి 23 సంవత్సరాల వయసుగల యువతి, యువకులు (నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది)
వేతనం: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు రూ.21వేల నుంచి గరిష్ఠంగా రూ.69వేల వరకు వేతనంగా పొందవచ్చు. 
వెబ్‌సైట్ : https://ssc.nic.in/

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter Facebook

Trending News