'పద్మావత్' చిత్ర ప్రదర్శనలపై జీ న్యూస్ సమగ్ర రిపోర్ట్..!

'పద్మావత్' సినిమా వివాదాస్పదమవుతున్న క్రమంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని బహిష్కరించడానికి శ్రీకారం చుట్టింది రాజపుత్ర కర్ణి సేన.

Last Updated : Jan 26, 2018, 09:51 AM IST
'పద్మావత్' చిత్ర ప్రదర్శనలపై జీ న్యూస్ సమగ్ర రిపోర్ట్..!

'పద్మావత్' సినిమా వివాదాస్పదమవుతున్న క్రమంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని బహిష్కరించడానికి శ్రీకారం చుట్టింది రాజపుత్ర కర్ణి సేన. వారణాసిలో ఓ రాజపుత్ర కులస్థుడు ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఆత్మహత్యకు ప్రయత్నించగా.. పలు చోట్ల థియేటర్ల లోపలకు వెళ్లకుండా రాజపుత్ర కర్ణిసేనల ప్రతినిధులు ప్రజలను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో దేశంలో పద్మావత్ చిత్రం విషయానికి సంబంధించి జరుగుతున్న వివిధ ఘటనలపై జీ న్యూస్ రిపోర్ట్ మీకోసం

*'పద్మావత్'  చిత్రాన్ని విడుదల చేసుకోవచ్చని సుప్రీం కోర్టు ప్రకటించాక, వివిధ రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. భారతదేశంలో ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల చుట్టూ పోలీసులను మోహరించాలని కోర్టు ఇప్పటికే తెలియజేసింది

*ఢిల్లీలో ఈ సినిమాని నిరసిస్తూ ఇప్పటికే ఒక స్కూలు బస్సుపై దాడి చేశారు. అలాగే జైపూర్, నాసిక్, ముంబయి ప్రాంతాల్లో రహదారి మార్గాలను కర్ణిసేన వాలంటీర్లు బ్లాక్ చేశారు

*గుజరాత్‌లో 21 బస్సులపై దుండగులు దాడి చేసి తగులబెట్టారు. ఈ ఘటనలో 118 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే వివిధ ఆస్తులను ధ్వంసం చేసినందుకు 300 మందిపై కేసులు పెట్టారు. ఇప్పటికే గుజరాత్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి 20,000 మంది పోలీసులను మోహరించారు. 

*రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవాలో బెదిరింపులు విపరీతంగా రావడం వల్ల ఈ సినిమాను ప్రదర్శించేది లేదని మల్టీప్లెక్స్ ఓనర్లే ప్రకటించడం గమనార్హం

*అయితే, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రతో పాటు పలు దక్షిణ భారత రాష్ట్రాల్లో ఈ చిత్ర ప్రదర్శన పట్ల ఎలాంటి అభ్యంతరాలు తలెత్తకపోవడంతో.. అక్కడ ప్రదర్శనలు ఎలాంటి అంతరాయం  లేకుండానే జరుగుతాయని సమాచారం

*ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్ క్షత్రియ మహాసభ ఈ చిత్రాన్ని విమర్శిస్తూ.. ఈ చిత్రంలో పద్మావతి పాత్రలో నటించిన దీపిక పడుకొనే ముక్కు కోసేవారికి భారీ నగదు బహుమతి ఇస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం

*లక్నోలో పద్మావతి చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద కర్ణిసేన సభ్యులు అందరికీ రోజాపూలు పంచుతూ వినూత్న రీతిలో నిరసనను తెలిపారు.

*మోదీ ప్రభుత్వానికి పకోడీ పాలిటిక్స్ అని, ఈ విషయంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న వారిని ఆయన ఏమీ చేయలేదని.. ఆయన ప్రగల్భాలు ముస్లిములు వద్దనేనని ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు

*సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించి ఈ చిత్రాన్ని బహిష్కరించిన నాలుగు రాష్ట్రాలపైనా కోర్టు ధిక్కారణ నేరం క్రింద కేసులు నమోదయ్యాయి.

*రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ 'పద్మావత్' సినిమా పాత గాయాలు రేపుతుందని.. ఈ విషయంలో కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ స్పందించకపోవడం శోచనీయమని తెలిపారు. 

*అలాగే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ, కులమతాలను రెచ్చగొట్టే ఏ చిత్రాన్ని కూడా ప్రదర్శించడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకూడదని తెలిపారు

*భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని చరిత్రలో అంశాలను వక్రీకరించడానికి ఉపయోగించకూడదని.. అందుకే చిత్ర నిర్మాతలు, నిరసనకారులతో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని కేంద్రమంత్రి వీకే సింగ్ తెలిపారు

*అయితే.. ప్రదర్శించిన చోటల్లా ఈ సినిమాపై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనలనే వస్తున్నాయి. 

Trending News