రాజస్థాన్: జైపూర్ జైల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జైల్లో శిక్ష అనభవిస్తున్న పాక్ జాతీయుడిని తోడిఖైదీలు కొట్టి చంపారు. జైలు అధికారుల చెప్పిన దాని ప్రకారం తోటి ఖైదీలతో పాకిస్థాన్ ఖైదీ గొడవపడ్డాడు.. దీంతో సహనం కోల్పోయిన తోటి ఖైదీలు అతనిపై తీవ్రంగా దాడి చేశారు. తీవ్రగాయాల పాలైన ఖైదీ చివరకు ప్రాణాలు కోల్పోయాడు. కాగా తాజా ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. హత్యకు గల కారణాలను ఇతర ఖైదీలను అడిగి వివరాలు సేకరిస్తున్నారు.