నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. చర్చకొచ్చే బిల్లులు!

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. చర్చకొచ్చే బిల్లులు! 

Last Updated : Nov 18, 2019, 11:10 AM IST
నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. చర్చకొచ్చే బిల్లులు!

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి డిసెంబర్ 13 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో పౌరసత్వ సవరణ బిల్లు, ట్రాన్స్‌జండర్ పర్సనల్ బిల్లు వంటి ఎన్నో కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. ఇవేకాకుండా ఢిల్లీలో అనధికారిక కాలనీలను రెగ్యులరైజ్ చేసే బిల్లు వైద్యులపై వేధింపులను అరికట్టే దిశగా బిల్లును తీసుకురావడం వంటివి ఉన్నాయి. నేడు చిట్ ఫండ్ సవరణ బిల్లు టేబుల్‌పైకి రానుంది. చిట్ ఫండ్ స్కీమ్స్‌లో మరింత పారదర్శకతను తీసుకొచ్చి వినియోగదారుల డబ్బుకు రక్షణ కల్పించే విధంగా చిట్ ఫండ్ బిల్లుకు సవరణలు తీసుకురావడమే లక్ష్యంగా ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. 1982 నాటి చిట్ ఫండ్ బిల్లుకు సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఈ బిల్లును గత సమావేశాల్లోనే ఆగస్టు 5న ప్రవేశపెట్టారు. 

నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష సమావేశానికి హాజరైన ప్రధాని మోదీ.. అన్ని పార్టీల సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ అపరిష్కృత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అందుకోసం ప్రభుత్వం అన్ని పార్టీల నేతలతో కలిసి పనిచేస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

Trending News