స్పీకర్ స్థానంలో కూర్చున్న యువకుడు, కేసు నమోదు

గుజరాత్  అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో ఓ యువకుడు కూర్చోవడం కలకలం రేపింది.

Last Updated : Apr 5, 2018, 08:59 AM IST
స్పీకర్ స్థానంలో కూర్చున్న యువకుడు, కేసు నమోదు

గుజరాత్: గుజరాత్  అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో ఓ యువకుడు కూర్చోవడం కలకలం రేపింది. మార్చి 28న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత తన కుర్చీలో కూర్చున్న యువకుడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం చూసి.. గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది మంగళవారం ఈ అంశంపై విచారణకు ఆదేశించారు.

ఈ అంశంపై అసెంబ్లీ కార్యదర్శి డిఎమ్ పటేల్ మాట్లాడుతూ, 'స్పీకర్ తప్ప ఎవరూ ఆ కుర్చీలో కూర్చోరాదు. ఇది  భద్రతా ఉల్లంఘన సమస్య కూడా. ఎందుకంటే అధికారం కలిగిన వ్యక్తులు మరియు శాసనసభ్యులు మాత్రమే ప్రధాన హాల్లోకి ప్రవేశించటానికి అనుమతిస్తారు. స్పీకర్ విచారణకు ఆదేశించారు.' అన్నారు.

"నివేదిక మొదట స్పీకర్‌కు సమర్పించబడుతుంది. ఆ తరువాత ఆయన ఆదేశాల ప్రకారం చర్య తీసుకోవలసి ఉంటుంది." అని ఆయన చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ కుర్చీపై కూర్చున్న వ్యక్తి ఎవరో గుర్తించబడ్డారని, అసెంబ్లీలో అతని ప్రవేశం కూడా ట్రేస్ అయిందని పటేల్ పేర్కొన్నారు. అతని పేరు రాహుల్ అని పేర్కొన్నారు.

గత వారం వైరల్ అయిన వాట్సాప్ గ్రూప్ స్క్రీన్ షాట్లపై దర్యాప్తు చేసిన అనంతరం అతనిని గుర్తించామని చెప్పారు. అసెంబ్లీ సమావేశంలో లేనప్పుడు, ఆ వ్యక్తి మరో వ్యక్తితో కలిసి హాల్‌లో ప్రవేశించారని చెప్పారు.

స్పష్టంగా, అతను కుర్చీలో కూర్చొని ఉండగా మరొక వ్యక్తి ఫోటోలను క్లిక్ చేశాడు. తొలుత స్పీకర్ కుర్చీలో కూర్చున్న రాహుల్ ఆతరువాత ఎమ్మెల్యేల కుర్చీలలో కూర్చున్నట్లు సీసీ కెమరాలలో రికార్డు అయిందని చెప్పారు. పోలీసులు రాహుల్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Trending News