PM Modi on Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. తన స్నేహితుడి ఇకలేరన్న వార్తను మాటల్లో చెప్పలేకపోతున్నారన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అబే మహోన్నతమైన గ్లోబల్ రాజనీతిజ్ఞుడు, అత్యుత్తమ నాయకుడని కొనియాడారు. ప్రపంచాన్ని అద్భుతంగా మార్చేందుకు తన వంతు కృషి చేశారని తెలిపారు.
జపాన్ మాజీ ప్రధాని షింజోపై ఉదయం కాల్పులు జరిగాయి. మధ్యాహ్నం సమయంలో ఘటన జరిగిందని ఎల్‌డీపీ వర్గాలు వెల్లడించాయి. నరాలో లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అబే వేదికపైనే పడిపోయాడు. అత్యంత సమీపం నుంచి రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అబే ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్ర గాయాలు అయిన ఆయనను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే షింబో అబే మృతి చెందినట్లు తెలుస్తోంది. దుండగుడు అతి దగ్గర నుంచి కాల్పులు జరిపినట్లు సమాచారం అందుతోంది. జపాన్‌లో ఆదివారం పార్లమెంట్ ఎగువసభకు ఎన్నికలు జరుగుతాయి. ఈక్రమంలో ప్రచారం చేస్తుండగా ఘటన జరిగింది. భారీగా కాల్పుల శబ్ధం రావడంతో కార్యకర్తలు, స్థానికులు పరుగులు తీశారు. అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
I am shocked and saddened beyond words at the tragic demise of one of my dearest friends, Shinzo Abe. He was a towering global statesman, an outstanding leader, and a remarkable administrator. He dedicated his life to make Japan and the world a better place.
— Narendra Modi (@narendramodi) July 8, 2022
Also read: YS Vijayamma: వైసీపీకి వైఎస్ విజయమ్మ రాజీనామా.. కుటుంబ కలహాలే కారణమా..?
Also read: Rains Alert: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్..అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook