వంద రోజుల పాలనపై ఆసక్తికరంగా స్పందించిన ప్రధాని మోడీ 

వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోడీ ఆసక్తికరంగా స్పందించారు

Last Updated : Sep 13, 2019, 01:15 AM IST
వంద రోజుల పాలనపై ఆసక్తికరంగా స్పందించిన ప్రధాని మోడీ 

రాంచి: మోడీ సర్కార్ వంద రోజలు పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రధాని మోడీ స్పందించారు. ఇది ట్రైలర్ మాత్రమే... అసలు సినిమా ముందుందని చమత్కరించారు. గురువారం ఝార్ఖండ్ లో పర్యటించించిన మోడీ అక్కడ పలు అభివృద్ధి  కార్యక్రమాలను ప్రారంభించారు. జార్ఖండ్ వేదికగా ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధర్ యోజన, లఘు వ్యాపారి మాన్ ధన్ పథకాలను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ఎన్డీయే -2 పాలనలో ప్రజలకు సమర్థవంతమైన పాలన అందిస్తున్నామన్నారు. వేగంగా..కచ్చితంగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వంగా గుర్తింపు సాధించామన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రజల సహకారంతో రానున్న రోజుల్లో మరింత మెరుగైన పాలన అందిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.

వందరోజుల పాలనలో ఎన్డీయే - 2 చేసిన పనులపై మోడీ వివరణ ఇచ్చారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తాము సంక్పలించుకున్నామని.. అందులో భాగంగా తీవ్రవాద నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేశామని తెలిపారు. ఆర్టికల్ 360 రద్దు చేసి జమ్మూ కశ్మీర్ ను శాశ్వతంగా భారత భూభాగంగా చేశామన్నారు.  జమ్మూకశ్మీర్, లడక్ లో అభివృద్ధిని నూతన శిఖరాలకు తీసుకెళ్లాలని సంకల్పించుకున్నామన్నారు. త్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చి ముస్లిం మహిళలకు అండగా నిలిచామన్నారు. అవినీతిపరుల భరతం పడుతున్నామని ..ఇప్పుడు కొంద మంది జైళ్లకు వెళ్లారని చెప్పారు..ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

Trending News