71000 Appointment Letters: 71,000 మందికి అపాయిట్మెంట్ లెటర్స్

PM Modi to Distribute 71000 Appointment Letters: ఇటీవల అక్టోబర్ నెలలోనూ ఇదే పద్ధతిలో రోజ్‌గార్ మేళా కింద 75 వేల మంది అభ్యర్థులకు కేంద్రం నియామక పత్రాలు అందజేసిన సంగతి తెలిసిందే. రేపు దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో భౌతికంగా నియామకపత్రాలు అందజేయనున్నారు. 

Written by - Pavan | Last Updated : Nov 21, 2022, 11:35 PM IST
  • నిరుద్యోగ నిర్మూలనలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన
  • అక్టోబర్ నెలలోనూ ఇదే పద్ధతిలో 75 వేల మందికి నియామక పత్రాలు
  • కర్మయోగి ప్రారంభ మాడ్యూల్ ద్వారా ఆన్‌లైన్ కోర్సులు
71000 Appointment Letters: 71,000 మందికి అపాయిట్మెంట్ లెటర్స్

PM Modi to Distribute 71000 Appointment Letters: రోజ్‌గార్ మేళాలో భాగంగా కొత్తగా నియమితులైన 71 వేల మంది అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ అపాయిట్మెంట్ లెటర్స్ పంపిణీ చేయనున్నారు. రేపటి మంగళవారమే ఈ కార్యక్రమం చేపట్టేందుకు కేంద్రం అన్నిరకాల ఏర్పాట్లు సిద్ధం చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా నియమితులైన అభ్యర్థులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడనున్నారు. ఈ మేరకు ఇవాళ సోమవారం ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 

నిరుద్యోగ నిర్మూలనలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన చేపడతామని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజ్‌గార్ మేళా చేపట్టి ఎంపికైన అభ్యర్థులకు వెనువెంటనే నియామక పత్రాలు అందజేస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. నేటి నిరుద్యోగ యువత వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడంతో పాటు దేశాభివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు రోజ్‌గార్ మేళా దోహదపడుతోందని కేంద్రం పేర్కొంది.

ఇటీవల అక్టోబర్ నెలలోనూ ఇదే పద్ధతిలో రోజ్‌గార్ మేళా కింద 75 వేల మంది అభ్యర్థులకు కేంద్రం నియామక పత్రాలు అందజేసిన సంగతి తెలిసిందే. రేపు దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో భౌతికంగా నియామకపత్రాలు అందజేయనున్నారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మినహాయించి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా అక్కడ కొత్తగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదా ఖాళీల భర్తీ కానీ చేపట్టడానికి వీలు లేక పోవడం వల్లే కేంద్రం ఆ రెండు రాష్ట్రాలను ఈ కార్యక్రమం నుంచి మినహాయించింది.

గతంలో భర్తీ చేసిన ఖాళీలకు తోడు కొత్తగా టీచర్లు, లెక్చరర్లు, నర్సులు, నర్సింగ్ ఆఫీసర్స్, డాక్టర్స్, పార్మసిస్టులు, రేడియోగ్రాఫర్స్, టెక్నికల్, పారామెడికల్ పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర హోంశాఖ ఆధీనంలోని వివిధ జాతీయ సాయుధ పోలీసు బలగాల్లోనూ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. 

కర్మయోగి ప్రారంభ మాడ్యూల్..
కొత్తగా నియమితులైన ఉద్యోగులు నిధి నిర్వహణలో ఎలా నడుచుకోవాలి, వృత్తి నైపుణ్యం ఎలా పెంపొందించుకోవాలి, తమ ఉద్యోగానికి సంబంధించిన విధి విధానాలు, నిబంధనలు ఏంటి ? ఎలాంటి బెనిఫిట్స్ ( Employees Benefits ) వర్తిస్తాయి, కొత్త మెళకువలు ఎలా నేర్చుకోవాలి, తదితర అంశాలపై పట్టు పెంచుకునేందుకు కర్మయోగి ప్రారంభ మాడ్యూల్ అనే కోర్సు ద్వారా ఆన్‌లైన్‌లో అవగాహన కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ పోర్టల్ igotkarmayogi.gov.in ద్వారా ఎవరికి కావాల్సిన కొత్త మెళకువలు వారు నేర్చుకునేందుకు వీలు ఉండనుంది.

Also Read : Indian Railways Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇండియన్ రైల్వేలో 35 వేల ఉద్యోగాలు

Also Read : Ration Card: రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఆ కార్డులు మొత్తం రద్దు

Also Read : PM Kisan: పీఎం కిసాన్ యోజన పథకం లబ్ధిదారులకు ముఖ్య గమనిక.. ఆ రోజే లాస్ట్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News