ఆ విషయంలో తెలంగాణ సర్కార్ నైపుణ్యం అదుర్స్ : మహబూబ్‌నగర్ ప్రచార సభలో ప్రధాని మోదీ

మహబూబ్‌నగర్ ప్రచార సభలో తెలంగాణ సర్కార్‌పై విరుచుకుపడిన ప్రధాని నరేంద్ర మోదీ

Last Updated : Mar 30, 2019, 08:59 AM IST
ఆ విషయంలో తెలంగాణ సర్కార్ నైపుణ్యం అదుర్స్ : మహబూబ్‌నగర్ ప్రచార సభలో ప్రధాని మోదీ

మహబూబ్‌నగర్: తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన అభివృద్ధికన్నా ఇంకా మెరుగైన అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ సర్కార్ నుంచే సరైన సహాయసహకారాలు అందలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మహబూబ్‌నగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభకు హాజరైన ప్రధాని మోదీ.. పాలమూరు వేదికపై నుంచే తెలంగాణ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు తమ లేబుల్ అతికించుకునేంత నైపుణ్యం తెలంగాణ సర్కార్ సొంతం అని చెబుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రధాని ఎద్దేవా చేశారు.  అలా లేబుల్ అతికించుకున్నా పర్వాలేదు కానీ ప్రభుత్వం పనిచేసి వుంటే మరింత బాగుండేది అంటూ కేసీఆర్ సర్కార్‌పై మోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. 

పక్కా ఇళ్ల పంపిణీపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం పేదలకు కోటి 50 లక్షల పక్కా ఇళ్లు పంపిణీ చేసిందని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పేదలకు ఫ్లాట్స్ పంపిణీ చేస్తానని ప్రకటించారని గుర్తుచేస్తూ.. కేసీఆర్ ఇచ్చిన ఫ్లాట్స్ మీలో ఎంతమందికి అందాయని సభకు హాజరైన వారిని ఉద్దేశించి మోదీ ప్రశ్నించారు.

Trending News