Kashi Vishwanath Corridor: ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి సందర్శించనున్నారు. గంగానదిని, కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని కలుపుతూ నిర్మించిన కారిడార్‌ను(Kasi Vishwanath corridor Inauguration) ప్రారంభించనున్నారు. అనంతరం ఈ కారిడార్‌ను జాతికి అంకితం ఇవ్వనున్నారు.
ఈ ప్రాజెక్టు కోసం రూ.339 కోట్లు ఖర్చు (Kasi Vishwanath corridor budget) చేసింది ప్రభుత్వం. ప్రధాని మోదీ (PM Modi) సొంత పార్లమెంట్ నియోజకవర్గం అయిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌పై ఆయన ప్రత్యేక శ్రద్ద వహించారు. పనులను ఎప్పటికప్పుడు సమీక్షించి.. ఇంజినీర్లకు పలు సూచనలు చేశారు.
భారీ ఏర్పాట్లు..
దేశంలో పవిత్ర పుణ్య క్షేత్రాల్లో కాశీ విశ్వనాథుడి ఆలయం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో ఆలయ సుందరీకరణ పనులు, కారిడార్ ప్రారంభోత్సవం కోసం భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. దీనితో వారణాసిలో (Varanasi) పండుగ వాతావరణం నెలకొంది.
55 అత్యాధునిక కెమెరాలు, భారీ డ్రోన్లతో ప్రాజెక్ట్ అందాలను చిత్రీకరిచనున్నారు. ఈ దృశ్యాలను దేశ ప్రజలంతా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.
'దివ్యకాశీ-భవ్య కాశీ' పేరుతో నెలపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశంలోని ప్రధాన శివాలయాలన్నింటిలో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేసి.. ఈ కార్యక్రమాన్ని విక్షించే వీలు కల్పించనున్నారు అధికారులు.
ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మత పెద్దలు, సాధువులు (Kasi Vishwanath Dham) తరలి రానున్నారు. మొత్తం మూడు వేల మంది రావచ్చని అంచనా. 12 మంది బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు.
2019లో శంకుస్థాపన..
కాశీ విశ్వనాథ్ కారిడార్ అభివృద్ధి పనులకు 2019 మార్చిలో శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టిన సమయం నుంచి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వచ్చారు. దేశంలో ఆకర్షణీయమైన పుణ్య క్షేత్రంగా దీనిని తీర్చిదిదేలా చొరవ తీసుకున్నారు.
Also read: Google Top Search: 2021లో గూగుల్ టాప్ సెర్చ్ వ్యక్తులెవరో తెలుసా, జాబితా విడుదల చేసిన గూగుల్
Also read: Omicron case in Kerala: కేరళలో తొలి ఒమిక్రాన్ కేసు.. దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook