West Bengal: పోలీసులపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

కరోనా వ్యాప్తి సమయంలో ఛాయ్ పే చర్చా లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు పదుల సంఖ్యలో బీజేపీ నేతలతో పాటు, వేలాది బీజేపీ కార్యకర్తలు హాజరవుతూ కోవిడ్19 నిబంధనలకు నీళ్లొదులుతున్నారు.

Last Updated : Sep 13, 2020, 10:34 AM IST
  • పశ్చిమ బెంగాలో వేలాది కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు
  • ఇటీవల బెంగాల్‌లో కరోనానే లేదని ఎప్పుడో అంతమైందన్న బీజేపీ అద్యక్షుడు దిలీప్ ఘోష్
  • పోలీసులు ఖాకీ డ్రెస్సులు వదిలేసి, కూరగాయలు అమ్మాలంటూ సంచలన వ్యాఖ్యలు
West Bengal: పోలీసులపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాలో నిత్యం వేలాది కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నా... రాష్ట్రంలో అసలు కరోనానే లేదు, ఎప్పుడో అంతమైందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఇటీవల వ్యాఖ్యానించారు. తాజాగా పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు వెన్నెముక లేదని, ఉద్యోగాలకు రాజీనామా చేసి వాళ్లు కూరగాయలు అమ్ముకోవడం ఉత్తమమంటూ బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. Corona Positive Cases: తెలంగాణలో తాజాగా 2,216 కరోనా కేసులు

‘పోలీసులు తృణమూల్ కాంగ్రెస్ క్యాడర్ అధికారులుగా భావిస్తున్నారు. టీఎంసీ నేతలు చెప్పినట్లుగా పోలీసులు పనిచేస్తున్నారు. ఆఫీసర్ ఇన్ ఛార్జ్, ఇన్‌స్పెక్టర్ ఇన్ ఛార్జ్‌లకు వెన్నెముక లేదు. అందుకే పోలీసులు ఉద్యోగానికి రాజీనామా చేసి, ఖాకీ చొక్కా వదిలేసి.. కూరగాయలు అమ్ముకోవడం మంచిదని’ పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు. Trent Boult breaks a stump: ఐపీఎల్ ప్రాక్టీస్‌లో వికెట్లు విరుగుతున్నాయి..

కాగా, కరోనా వ్యాప్తి సమయంలో ఛాయ్ పే చర్చా లాంటి కార్యక్రమాలకు పదుల సంఖ్యలో బీజేపీ నేతలతో పాటు, వేలాది బీజేపీ కార్యకర్తలు హాజరవుతూ కోవిడ్19 నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కమర్‌హాతి సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో భౌతిక దూరం పాటించకుండా వేలాది మంది పాల్గొనడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం బీజేపీ శ్రేణుల సమావేశాలు, సభలు అడ్డుకునేందుకే పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారని దిలీప్ ఘోష్ పదే పదే ఆరోపిస్తున్నారు. NEET 2020 Exam: నేడే నీట్.. విద్యార్థులు ఇవి పాటించాలి

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News