Sharmishta Mukherjee sharing his father's memories: న్యూఢిల్లీ: కరోనా ( Coronavirus ) మహమ్మారి బారిన పడి ఆసుపత్రిలో చేరిన భారత మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ( Pranab Mukherjee ) కి ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రిలో బ్రెయిన్ సర్జరీ చేసిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజుల నుంచి వైద్యులు ప్రణబ్ ముఖర్జీని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ మెరుగుపడలేదని, ఇంకా క్రిటికల్‌గానే ఉన్నట్లు ఆర్ఆర్ ఆసుపత్రి వైద్యులు తాజాగా ప్రకటించారు. ఈ క్రమంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొనకపోవడంపై ఆయన కుమార్తె షర్మిష్ట ముఖర్జీ ( Sharmistha Mukherjee ) గత వేడుకల జ్ఞాపకాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. Also read: Aatmanirbhar Bharat: ఆత్మనిర్భర్ భారత్ ప్రయోజనాలపై ప్రధాని మోదీ కీలక ప్రసంగం
In his childhood, my dad & my uncle would hoist National Flag at our ancestral home in village. Since then, he never missed a year to hoist tri-colour on Independence Day. Sharing some memories from last years celebration at home. I’m sure he’ll do the same next year. Jai Hind 🇮🇳 pic.twitter.com/SX0CVO8lW6
— Sharmistha Mukherjee (@Sharmistha_GK) August 15, 2020
‘‘నా చిన్నతనంలో నాన్న, మామయ్య కలిసి మా పూర్వీకుల ఇంట్లో జాతీయ జెండా ఎగురవేసేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్న స్వాతంత్ర్య వేడుకలను ఎన్నడూ మిస్ కాలేదు. ఈ సందర్భంగా నాన్న గత జ్ఞాపకాలను మీతో పంచుకుంటున్నాను. వచ్చే ఏడాది నాన్న తప్పకుండా జాతీయ జెండాను ఎగురవేస్తారు..జైహింద్’’ అంటూ షర్మిష్ట ఆశాభావం వ్యక్తం చేస్తూ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. Also read: Lav Agarwal: కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీకి కరోనా
Pranab Mukherjee: నాన్న తప్పకుండా జెండా ఎగురవేస్తారు: షర్మిష్ట