అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ఆయన మరోసారి ముఖ్యమంత్రులతో వీడియో కాన్పరెన్స్ ద్వారా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వివిధ రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎలా ఉంది..? ప్రస్తుతం పరిస్థితి ఏంటి..? ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది..? అనే విషయాలను ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారా..? అనే విషయాన్ని ఆరా తీశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండో దశ లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3 వరకు లాక్ డౌన్ 2.0 కొనసాగుతుందని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. ఐతే కరోనా మహమ్మారి ఇంకా లొంగి రాలేదు. ప్రస్తుతం భారత దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27 వేల 892కు చేరింది. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు 872 మంది బలయ్యారు.
కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవాలంటే ప్రజలంతా ఒక్కొక్కరు ఒక్క సైనికుడిలా యుద్ధం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నిన్న మన్ కీ బాత్ లో ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. అంతే కాదు దీన్ని ప్రజా యుద్దంగా అభివర్ణించారు. ఈ రోజు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లోనూ ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలే చేసినట్లుగా తెలుస్తోంది. సామూహిక యుద్ధం కొనసాగిద్దామని చెప్పినట్లు సమాచారం. అలాగే లాక్ డౌన్ పొడగించే విషయంపైనా వారి అభిప్రాయాలు సేకరించినట్లు తెలుస్తోంది.
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాన్ని సేకరించిన తర్వాత.. మరోసారి లాక్ డౌన్ విషయంలో కేంద్రం ఓ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. మే 3వ తేదీకి ఇంకా వారం రోజులు సమయం ఉంది. ఈలోగా మరో కొత్త నిర్ణయం ప్రకటిస్తారా..? వేచి చూడాలి.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మే 3 తర్వాత ఏం చేద్దాం..?