Helicopter Crashes: హెలీకాప్టర్. ప్రయాణం ఎంత సులభమో ఇప్పుడు అంతే రిస్క్. ముఖ్యంగా పెద్దోళ్లకు వెంటాడే ఓ భయం. దేశంలో చాలామంది ప్రముఖుల్ని బలితీసుకుంది ఈ హెలీకాప్టర్ ప్రయాణమే. మొన్న వైఎస్ఆర్..నేడు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్.
గాలిలో ఎగిరి..గాలిలోనే ప్రాణాలు పోగొట్టుకోవడం. నిజంగా అత్యంత విషాదకరం. ప్రయాణం సులభతరం చేస్తుంది గానీ ఆ సులభం వెనుక ముప్పు వెంటాడుతుంది. దేశంలో ఇప్పటి వరకూ జరిగిన హెలీకాప్టర్ ప్రమాదాలకు కచ్చితంగా ఇదీ కారణమని కూడా తెలియని పరిస్థితి. తప్పని పరిస్థితుల్లో ప్రయాణాలు చేస్తున్నా..హెలీకాప్టర్ ప్రయాణమంటే భయపడాల్సిన పరిస్థితి. ప్రకృతి సహకరించకపోయినా..అనుకోని సాంకేతిక సమస్యలు తలెత్తినా అలాగే నేలకూలాల్సి పరిస్థితి. హెలీకాప్టర్ క్రాష్ అయిందంటే ఇక బతికి బట్టకట్టిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇండియాలో ప్రముఖుల్ని హెలీకాప్టర్ ప్రమాదాలు వెంటాడుతున్నాయి. దేశంలో ఇప్పటివరకూ హెలీకాప్టర్ ప్రమాదాల్లో(Helicopter Crashes)మరణించినవారిలో కొందరు..
2011 ఏప్రిల్ 30
అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించారు. పవన్ హాన్స్ బీ8 మోడల్ హెలీకాప్టర్..అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ వద్ద వాతావరణ ప్రతికూల పరిస్థితులతో కుప్పకూలింది. ఈ ఘటనలో ఆయనతో పాటు ఐదుగురు మరణించారు.
2009 సెప్టెంబర్ 2
దేశమంతటినీ విషాదంలో నింపిన ఘటన ఇది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని శోకం నింపిన సంఘటన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండవసారి బాధ్యతలు స్వీకరించి..మూడు నెలలు కూడా గడవకుండానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Ys Rajasekhar reddy)హెలీకాప్టర్‌లో ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తుండగా..ఆయన ప్రయాణిస్తున్న బెల్ 430 హెలీకాప్టర్ నల్లమల అడవుల్లో కుప్పకూలింది. ఈ ఘటనలో వైఎస్ఆర్తో పాటు ఆరుగురు మరణించారు. ప్రమాదం అనంతరం జరిపిన విచారణలో ఈ హెలీకాప్టర్ ప్రయాణానికి క్షేమకరం కాదని..పైలట్లు పైలట్లు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని తెలిసింది.
2005 మార్చ్ 31
ఇక మరో ప్రముఖవ్యక్తి హర్యానాకు చెందిన మంత్రి ఓపీ జిందాల్(OP Jindal). 2005 మార్చ్ 31వ తేదీన హర్యానా రాష్ట్ర మంత్రి ఓపీ జిందాల్ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ఉత్తరప్రదేశ్‌లోని షెహరాన్‌పూర్ వద్ద కుప్పకూలింది. ఈ ఘటనలో మంత్రి ఓపీ జిందాల్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ కుమారుడు సురేందర్ సింగ్ మరణించారు.
2004 ఏప్రిల్ 17
సినీ పరిశ్రమను తీరని విషాదంలో నింపిన ఘటన ఇది. తెలుగులో అగ్రనటిగా కొనసాగుతున్న సమయంలో అందాల తార సౌందర్య ఒక్కసారిగా ప్రమాదంలో మరణించారు. తెలుగు సినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్రేసిన సౌందర్య (Soundarya)ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ బెంగళూరులో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు పోయాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మంచినటిగా పేరు తెచ్చుకున్నారు.
2002 మార్చ్ 3
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో ప్రముఖ నేతను కోల్పోయిన రోజు. అప్పటి లోక్‌సభ స్పీకర్, తెలుగుదేశం పార్టీ నేత జీఎంసీ బాలయోగి(Gmc Balayogi)హెలీకాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రయాణిస్తున్న బెల్ 206 హెలీకాప్టర్ పశ్చిమ గోదావరి జిల్లాలో కుప్పకూలిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఆయన మరణం తెలుగుదేశం పార్టీకు ఇప్పటికీ తీరనిలోటుగానే ఉంది. సాంకేతిక కారణాలతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
2001సెప్టెంబర్ 30
హెలీకాప్టర్ ప్రమాద రూపంలో కోల్పోయిన మరో నేత మాధవరావు సింథియా(Madhavrao Scindia). ప్రస్తుత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తండ్రి. కాంగ్రెస్ సీనియర్ నేత. కాన్పూర్ లో జరిగిన ఈ ప్రమాదంలో ఆయనతో పాటు ఏడుగురు మరణించారు. ఆయన మరణానంతరం మొన్నటివరకూ కాంగ్రెస్ లోనే కొనసాగిన కుమారుడు జ్యోతిరాదిత్య సింథియా ఇటీవల బీజేపీలో చేరి..కేంద్రమంత్రి అయ్యారు.
1980 జూన్ 23
ఇక మొత్తం దేశమే కాదు ప్రపంచమంతా అవాక్కైన ఘటన ఇది. మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ(Sanjay Gandhi)హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించారు. హెలీకాప్టర్ ప్రమాదమంటే గుర్తొచ్చే తొలి ఘటన ఇదే దేశంలో. సఫ్దర్‌జంగ్ విమానాశ్రయంలోనే జరిగిన ప్రమాదమిది.
అదే సమయంలో కొంతమంది ప్రముఖులు హెలీకాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు దక్కించుకున్నారు కూడా. ఇప్పటి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌తో ప్రాణాలు దక్కాయి. మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్, కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్, పృధ్వీరాజ్ చౌహాన్, కుమారి శైలజ, పంజాబ్ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాళీదళ్ ఛీప్ సుఖ్బీర్ సింగ్ బాదల్ తదితరులున్నారు.
Also read: సర్జికల్ స్ట్రైక్స్ నుంచి మయన్మార్ మిషన్ వరకు.. బిపిన్ రావత్ కెరీర్ హైలైట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook