ఆయుధాలతో బెదిరించి బ్యాంకు నుంచి రూ.19 లక్షల దోపిడీ

ఆయుధాలతో బెదిరించి బ్యాంకు నుంచి రూ.19 లక్షల దోపిడీ

Last Updated : Sep 17, 2019, 07:50 AM IST
ఆయుధాలతో బెదిరించి బ్యాంకు నుంచి రూ.19 లక్షల దోపిడీ

ఉదయ్‌పూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పట్టపగేల దోపిడీ దొంగలు చెలరేగిపోయారు. మద్రి పారిశ్రామిక వాడలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచ్‌లోకి మధ్యాహ్నం 12:20 గంటల సమయంలో ఆయుధాలతో చొరబడిన దోపిడీ దొంగలు తుపాకులతో సిబ్బందిని బెదిరించి భారీ దోపిడీకి పాల్పడ్డారు. తొలుత గాల్లోకి కాల్పులు జరిపి సిబ్బందిని బెదిరించి వారి నుంచి రూ.19.72 లక్షలు దోచుకున్న అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. 

బ్యాంకులో దోపిడీ ఘటనపై జిల్లా ఎస్పీ కైలాశ్ బిష్నోయ్ మాట్లాడుతూ.. దోపిడీ ఘటన దృశ్యాలన్నీ బ్యాంకులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయినట్టు తెలిపారు. మొత్తం ఆరుగురు దొంగలు ఈ దోపిడిలో పాల్గొన్నారని.. దొంగల ముఖాలు సీసీటీవి దృశ్యాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని ఎస్పీ పేర్కొన్నారు. సీసీటీవి దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నామని.. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

Trending News