Punjab Results 2022: పంజాబ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆమ్ఆద్మీ పార్టీ

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో.. పంజాబ్‌లో  భిన్నంగా ఆమ్‌ఆద్మీ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. కేజ్రీవాల్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతుంది.  

Last Updated : Mar 10, 2022, 01:54 PM IST
  • కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన అరవింద్ కేజ్రీవాల్
  • ఆమ్‌ఆద్మీ పార్టీకి పట్టం కట్టిన పంజాబ్ ప్రజలు
  • ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆమ్‌ఆద్మీ పార్టీ
Punjab Results 2022: పంజాబ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆమ్ఆద్మీ పార్టీ

Punjab Results 2022: ఈ రోజు కౌంటింగ్ జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్ మరియు మణిపాల్ రాష్ట్రాలలో బీజేపీ ఆధిక్యం కనపబరుస్తున్న సమయంలో పంజాబ్ లో మాత్రం భిన్నంగా ఆమ్‌ఆద్మీ పార్టీ జోరు కనబరుస్తుంది. 

అటు కాంగ్రెస్, బీజేపీ కాకుండా అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అనుకున్న దానికి భిన్నంగా జాతీయ పార్టీలకు షాక్ నిస్తూ, ఆమ్‌ఆద్మీ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. 

పంజాబ్‌లో రాష్ట్ర రాజకీయ పార్టీలు ఊహించని విధంగా ప్రభుత్వ ఏర్పాటు దిశగా చీపురు పార్టీ హవా కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య 59 కంటే ఎక్కువ స్థానాల్లో జోరు కొనసాగిస్తోంది ఆమ్‌ఆద్మీ పార్టీ. చీపురు పార్టీ నేషనల్ కన్వీనర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించిన మ్యానిఫెస్టో, హామీలకు పంజాబ్ ప్రజలు ఫిదా అయ్యారు.  దేశ రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ పాలనను పంజాబ్ ప్రజలు నమ్మారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌లో పంజాబ్ రిజల్ట్స్ హేమాహేమీలకు దిమ్మతిరిగేలా చేశాయి. అధికార కాంగ్రెస్, స్థానికంగా ప్రజాదరణ ఉన్న శిరోమణి అకాళీ దళ్, కమలం పార్టీకి షాక్ ఇచ్చింది చీపురు పార్టీ. పంజాబ్‌లో ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తుంది. 

పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల కౌంటింగ్ కొనసాగుతుండగా..ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 59 స్థానాలు. ఫలితాల్లో ఇప్పటికే చీపురు పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యను అధిగమించింది. పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. తాజా ఫలితాలతో పంజాబ్ చీపురు పార్టీ నేతలు, కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు.

Also Read: IPL 2022: గేల్‌, డివిలియర్స్‌ కాదు.. రోహిత్‌ శర్మనే నాకు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు: ఢిల్లీ ఎంపీ

Also Read: Pujab Election Result 2022: మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓటమి.. ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయారంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Facebook , Twitterమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News