ఎన్డీయే సర్కార్ తీరుపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో మారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్ లోని మిరేన పబ్లిక్ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన ఐదు దశల ఎన్నికల్లో మోడీని జనాలు తిరస్కరించారని రాహుల్ పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన మోడీ మరోసారి ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు.
ఈ సందర్భంగా ''చౌకీదార్ చోర్'' నినాదాన్ని ప్రస్తావిస్తూ.... కాపలాదారుడే దొంగ ( చౌకీదార్ చోర్ ) అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ కాదని... ప్రధాని మోడీ చేతిలో మోసపోయిన రైతులు, యువత ఆగ్రహంలో నుంచి ఈ నినాదం పుట్టుకొచ్చిందన్నారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారు. రూ.15 లక్షలు బ్యాంకు ఖాతాల్లో జమా చేస్తామన్నారు. రైతులకు మద్దతు ధర ఇస్తామన్నారు. మీకు అందించారా అని జనాలను ఒక పబ్లిక్ మీటింగ్ లో ప్రశ్నించానని...అప్పుడు జనాల నోట ..ఒకే మాట వనిపించింది. అదే.. చౌకీదార్ చోర్ హై అనే మాట..జనాల నుంచి పుట్టుకొచ్చిన ఈ నినాదాన్నే కాంగ్రెస్ పార్టీ తన నినాదంగా ఎన్నికల్లో ప్రచారం చేస్తోందని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు