Ram mandir Live Streaming: మరి కొద్ది గంటల్లో అయోధ్య నూతన రామాలయం ప్రారంభం కానుంది. జనవరి 22వ తేదీ మద్యాహ్నం దివ్య రామమందిర ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరగనుంది. వారణాసి ప్రధాన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన పూజలు చేయనున్నారు. దేశ ప్రజలు ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు దూరదర్శన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
జనవరి 22వ తేదీ మద్యాహ్నం 12.20 నుంచి ప్రారంభమయ్యే అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అందరూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. దూరదర్శన్ ఛానెల్‌లో ఈ కార్యక్రమాన్ని జనవరి 22వ తేదీ ఉదయం 11 గంటల్నించి మద్యాహ్నం 1 గంట వరకూ ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది దూరదర్సన్. డీడీ న్యూస్, డీడీ నేషనల్ ఛానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారంతో పాటు ఇతర న్యూస్ ఏజెన్సీలకు ఫీడ్ అందిస్తారు. ఇతర ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు దూరదర్శన్ యూట్యూబ్ లింక్ అందిస్తారు.
అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కోసం దూరదర్శన్ అయోధ్యలోని వివిధ ప్రాంతాల్లో 40 కెమేరాలు ఏర్పాటు చేసింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 4 కే టెక్నాలజీతో ప్రసారం కానుంది. జీ20 సమావేశాలను ఏ విధంగా ప్రత్యక్ష ప్రసారం చేశామో అదే విధంగా 4కే ట్రాన్స్‌మిషన్ ద్వారా రామమందిరం ప్రాణ ప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని దూరదర్శన్ తెలిపింది.
రామమందిరం ప్రారంభోత్సవ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ భారత రాయబార కార్యాలయాలు, కన్సులేట్ ఆఫీసులు, దేశంలోని ప్రదాన దేవాలయాల్లో చేయనున్నారు.
Also read: LIC New Policy: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ, జీవన్ ధార 2 కొత్త డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook