ఎన్డీటీవీ ప్రమోటర్ ఆర్ఆర్‌పీఆర్ గ్రూప్ నుంచి ఆ సంస్థ వ్యవస్థాపకులైన ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లు వైదొలగిన తరువాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రణయ్ రాధికా రాజీనామాల అనంతరం సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీష్ కుమార్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
ఎన్డీటీవీలో మారుతున్న పరిణామాలు
ప్రఖ్యాత అదానీ గ్రూప్ ఎన్డీటీవిలో 29.18 వాటా దక్కించుకోవడంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా ఎన్డీటీవీ ప్రమోటర్ గ్రూప్ ఆర్ఆర్‌పీఆర్‌కు ఆ సంస్థ వ్యవస్థాపకులైన ప్రణయ్ రాయ్ రాధికా రాయ్‌లు రాజీనామా చేశారు. న్యూస్ ఛానెల్‌లో మాత్రం ఈ ఇద్దరూ ఇంకా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరు రాజీనామా చేసిన వెంటనే ఆ స్థానంలో సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగాలియా, సెంథిల్ సినియాలను ఆర్ఆర్‌పీఆర్ బోర్డు కొత్త డైరెక్టర్లుగా నియమించింది.
ఎందుకీ పరిస్థితి
ఎన్డీటీవీ ప్రమోటర్ కంపెనీ ఆర్ఆర్‌పీఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీకు 2009లో విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ 403 కోట్ల రుణమిచ్చింది ఆ తరువాత వీసీపీఎల్ యాజమాన్యం కాస్తా అదానీ గ్రూప్ చేతికి వెళ్లింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం రుణాన్ని 29.18 శాతం వాటాగా మార్చుకుని ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ వాటాదారుగా మారింది. అదనంగా మరో 26 శాతం వాటా కొనుగోలుకై ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ పూర్తయితే..ఎన్డీటీవీలో మెజార్టీ షేర్ అదానీ గ్రూప్‌కు దక్కుతుంది.
ఎన్డీటీవీ యాజమాన్యం మారడంతో సెలెబ్రిటీలు, రాజకీయ నేతలు ఎన్డీటీవీ అన్‌ఫాలో చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. అన్‌ఫాలో ఎన్డీటీవీ ట్రెండింగ్ అవుతోంది కూడా. ఇప్పుడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఛానెల్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీష్ కుమార్ రాజీనామా చేసినట్టు ఎన్డీటీవీ ఇంటర్నెల్ మెయిల్ స్పష్టం చేసింది. రామన్ మెగసెసే అార్డు గ్రహీత, ప్రైమ్‌టైమ్, దేశ్ కీ బాత్, హమ్‌లాగ్, రవీశ్ కీ రిపోర్ట్ వంటి కార్యక్రమాలతో ప్రాచుర్యం పొందిన లెజెండ్ జర్నలిస్ట్ రవీశ్ కుమార్ రాజీనామా తక్షణం అమల్లో వస్తుందని కూడా ఛానెల్ ఇంటర్నల్ మెయిల్ తెలిపింది.
Also read: Gujarat Elections 2022: గుజరాత్ తొలిదశ పోలింగ్ రేపే, 89 స్థానాల్లో పోలింగ్‌కు పూర్తయిన ఏర్పాట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook