డీఎంకే పార్టీ.. సంపాదనలో మేటి

  

Last Updated : Oct 28, 2017, 04:23 PM IST
డీఎంకే పార్టీ.. సంపాదనలో మేటి

అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)  సంస్థ ఇటీవలే భారతదేశంలో అత్యధిక వార్షికాదాయం కలిగిన ప్రాంతీయ పార్టీల జాబితాను ప్రకటించింది. అందులో తమిళనాడుకి చెందిన డీఎంకే (ద్రవిడ మున్నేత్ర కజిగం) పార్టీ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఏడీఆర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 77.63 కోట్ల రూపాయల ఆదాయంలో ఈ పార్టీ మొదటి స్థానంలో నిలిచింది. తమిళనాడు అధికార పార్టీ అన్నా డీఎంకే రూ.54.93 కోట్ల ఆదాయంతో రెండో స్థానంలోనూ, ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తెలుగుదేశం 15.97 కోట్లతో మూడవ స్థానంలోనూ కొనసాగుతున్నాయి. అలాగే అత్యధికంగా ఖర్చు చేసే పార్టీల జాబితాలో జేడీయూ 23.46 కోట్ల వార్షిక వ్యయంతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇక టీడీపీ 13.10 కోట్ల రూపాయలతో రెండవ స్థానంలోనూ, ఆమ్ ఆద్మీ పార్టీ 11.09 కోట్ల వ్యయంతో మూడవ  స్థానంలోనూ కొనసాగుతున్నాయి. డీఎంకే, ఏఐఏడీఎంకే, ఏఐఎంఐఎం పార్టీలు 80 శాతం ఆదాయాన్ని కూడా ఖర్చు చేయలేని పార్టీల జాబితాలో తొలి మూడు స్థానాలు దక్కించుకున్నాయి. 

Trending News