Arvind kejriwal: దేశ రాజధానిని పాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకు సై అంటోంది. ఇతర పార్టీలకు సవాలు విసురుతోంది. ఆరు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నామని ఆప్ వెల్లడించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీకు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. హిందూవాహిని పేరుతో గుర్తు తెలియని వ్యక్తి బెదిరిస్తున్నట్టు తెలిసింది. ఢిల్లీ నార్త్ ఎవెన్యూ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
AAP: ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. ఢిల్లీలో మూడోసారి అధికారం చేపట్టిన తరువాత పార్టీని విస్తరించే క్రమంలో యూపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
దేశ వ్యాప్తంగా రైతుల భారత్ బంద్ (Bharat Bandh) ప్రశాంతంగా కొనసాగుతోంది. అన్ని విపక్ష పార్టీలు, రైతు, కార్మిక సంఘాలు రోడ్లపై భైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు (Delhi Police) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal ) ను గృహ నిర్బంధంలో ఉంచినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ (APP) ట్వీట్ చేసింది.
మత విద్వేష వ్యాఖ్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఇటీవల కర్ణాటకలో జరిగిన ఘటన నిదర్శనం. దేవుళ్లపై కామెంట్లు చేసిన పార్టీ మాజీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP suspends Jarnail Singh) వేటు వేసింది.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రజలు అందించిన అధికారాన్ని సైతం ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోతోంది. కరిష్మా ఉన్న పార్టీ నేతలు ఒక్కొక్కరిగా వదిలిపోతున్నారు. ఈ నేపద్యంలో వెంటిలేటర్ పై ఉన్న ఆ పార్టీకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఆప్ ( AAP ) సన్నాహాలు చేస్తోంది. ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్ చడ్డా వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.
ఢిల్లీలో ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఈ జాబితాలోకి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ చేరారు. ఆయన గత రెండు రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలు, జ్వరంలో బాధపడుతున్నారు. టెస్టులు నిర్వహించగా కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది.
ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కేజ్రీవాల్ కేబినెట్ మంత్రులతో ఎల్జీ అనిల్ బైజాల్ ప్రమాణ స్వీకారం చేయించారు.
దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రిగా ముచ్చటగా మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. దీంతో మరోసారి ఢిల్లీ పీఠాన్ని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దక్కించుకున్నట్లయింది.
ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఐతే ఆమ్ ఆద్మీ పార్టీ జోరుగా ఆధిక్యంలో దూసుకెళ్తోంది. దీంతో ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి విజయం తథ్యమైందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోయింది. అభివృద్ధికి పట్టం కడతామని ప్రజలు తీర్పు ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది. అంతా ముందు ఊహించిన విధంగానే ఢిల్లీ ఎన్నికల్లో దేశ రాజధాని ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టినట్లుగా కనిపిస్తోంది. గత ఐదేళ్ల మళ్లీ కావాలని కోరుకుంటున్నట్లుగా అనిపిస్తోంది.
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ. .. జోరుగా దూసుకు వెళ్తోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఢిల్లీ ఫలితాల వెల్లడి కోసం అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. కేజ్రీవాల్ పార్టీ దాదాపు 50 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది.
ఢిల్లీ ఎన్నికల ఫలితాల కోసం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మరికాసేపట్లో తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. మొత్తంగా మధాహ్నం వరకు ఈవీఎంలలో నిక్షిప్తమైన 672 మంది భవితవ్యం తేలిపోనుంది. ఈ నేపథ్యంలో దేశంలో అందరి చూపు .. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో సత్తా చాటుతామని అటు ఆమ్ ఆద్మీ పార్టీ .. ఇటు బీజేపీ రెండు ధీమాగా ఉన్నాయి.
ఢిల్లీ ఎన్నికల్లో ఊహించిందే జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకే జనం మళ్లీ పట్టం కట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో మళ్లీ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వమే కొలువుదీరేలా కనిపిస్తోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూర్చవని పాటియాలా ఎంపీ ప్రినీత్ కౌర్ అన్నారు. ఢిల్లీలో మరోసారి ఆప్ అధికారంలోకి వస్తుందని చెప్పారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ముందుగా ఊహించినట్లుగానే, ఎగ్జిట్ పోల్స్ చాలావరకు ఆమ్ ఆద్మీ పార్టీయే మంచి ఫలితాలను సాధిస్తుందని, ఢిల్లీ ఎన్నికల విజయం బీహార్ పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని ఆప్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
భారతీయ జనతా పార్టీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలపాలని సవాలు విసిరిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బుధవారం వరకు గడువిచ్చిన సంగతి తెలిసిందే. నేడు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బహిరంగ చర్చకు రావాలని ఆహ్వానించారు. చర్చ బహిరంగ ప్రదేశంలో, మీకు నచ్చిన యాంకర్‌తో ఢిల్లీ ప్రజల ముందుండాలని ఆయన అన్నారు.