Murder for Chapati: ఢిల్లీలో దారుణ ఘటన... ఒక్క చపాతీ కోసం ప్రాణాలే తీశాడు..

Murder for Chapati: ఢిల్లీలో మున్నా అనే రిక్షావాలా దారుణ హత్యకు గురయ్యాడు. తనకు చపాతీ ఇవ్వలేదనే కారణంతో ఓ వ్యక్తి అతన్ని కత్తితో పొడిచి చంపాడు.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 28, 2022, 11:21 AM IST
  • ఢిల్లీలో దారుణ ఘటన
  • చపాతీ ఇవ్వలేదని వ్యక్తి హత్య
  • కత్తితో పొడిచి చంపిన చెత్త ఏరుకునే వ్యక్తి
Murder for Chapati: ఢిల్లీలో దారుణ ఘటన... ఒక్క చపాతీ కోసం ప్రాణాలే తీశాడు..

Murder for Chapati: ఢిల్లీలో దారుణం జరిగింది. చపాతీ ఇవ్వలేదనే కారణంతో ఓ రిక్షావాలాను చెత్త ఏరుకునే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...  ఢిల్లీలోని కరోల్‌బాగ్ ప్రాంతానికి చెందిన మున్నా (40) రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 26న ఉదయం 10గంటలకు అతను విష్ణు మందిర్ మార్గ్‌లో ఒకచోట ఆగాడు. హోటల్ నుంచి తెచ్చుకుంటున్న చపాతీ తింటుండగా.. ఓ తాగుబోతు వ్యక్తి అక్కడికి వచ్చాడు. తనకూ ఓ చపాతీ ఇవ్వాలని మున్నా కోరాడు. దీంతో మున్నా అతనికి ఒక చపాతీ ఇచ్చాడు. 

ఆ తర్వాత మరో చపాతీ కావాలని ఆ తాగుబోతు వ్యక్తి మున్నాను కోరాడు. అందుకు మున్నా నిరాకరించడంతో తీవ్ర కోపోద్రిక్తుడయ్యాడు. వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా అతనిపై దాడి చేశాడు. స్థానికులు గమనించి వెంటనే మున్నాను ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. లఖన్ అనే ప్రత్యక్ష సాక్షి ఒకరు ఈ వివరాలు పోలీసులకు వెల్లడించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాలతో పాటు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరిపారు. నిందితుడిని పట్టుకునేందుకు ఎస్ఐ విక్రమ్ సింగ్, ఏఎస్ఐ జితేందర్ సింగ్‌లతో ప్రత్యేక టీమ్‌ను రంగంలోకి దింపారు. ఎట్టకేలకు జజోరియా పార్క్‌లో నిందితుడిని పోలీసులు పట్టుకోగలిగారు. విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడు. నిందితుడు ఫిరోజ్ ఖాన్ చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు గుర్తించారు. అతను మద్యానికి బానిసయ్యాడని, మద్యం మత్తులోనే హత్యకు ఒడిగట్టాడని నిర్ధారించారు.

Also Read: Komatireddy: అనర్హత వేటు కోసమే సస్పెన్షన్ లేటు? కోమటిరెడ్డి విషయంలో కాంగ్రెస్ పక్కా స్కెచ్?

Also Read: Casino Dealers: 'క్యాసినో' దందా.. తెల్లవారుజాము వరకు ఈడీ సోదాలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News