దేశవ్యాప్తంగా పలు జోన్లలో కానిస్టేబుల్, ఎస్సై విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు భారతీయ రైల్వే గత జూన్ నెలలో ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ పరీక్షలకు సంబంధించి తాజాగా పరీక్ష తేదీలపై ఓ ప్రకటన వెలువడింది. డిసెంబర్ 19 నుంచి వివిధ జోన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు భారతీయ రైల్వే తొలిసారిగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు ఆహ్వానించి, పరీక్ష సైతం ఆన్‌లైన్‌లోనే నిర్వహించనుంది. మొదటిగా డిసెంబర్ 19న గ్రూప్ Eలోని నార్త్ ఫ్రాంటైర్ అభ్యర్థులకు పరీక్ష జరగనుంది.
మిగతా గ్రూపుల పరీక్షల వివరాలు వరుస క్రమంలో ఇలా ఉన్నాయి.
1. గ్రూప్ E: నార్త్ ఫ్రాంటైర్ రైల్వే
2. గ్రూప్ F: ఆర్.పి.ఎస్.ఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్)
3. గ్రూప్ A: దక్షిణ రైల్వే, దక్షిణ పశ్చిమ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే
4. గ్రూప్ B: సెంట్రల్ రైల్వే, వెస్టెర్న్ రైల్వే, వెస్టెర్న్ సెంట్రల్ రైల్వే, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే
5. గ్రూప్ C: తూర్పు రైల్వే, తూర్పు మధ్య రైల్వే, సౌత్ ఈస్ట్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే
6. గ్రూప్ D: నార్త్ రైల్వే, నార్త్ ఈస్ట్ రైల్వే, నార్త్ వెస్ట్ రైల్వే, నార్త్ సెంట్రల్ రైల్వే
డిసెంబర్ 9వ తేదీ నుంచి అర్హులైన అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఇండియన్ రైల్వే ప్రకటన స్పష్టంచేసింది.