Russian women Harassed: ఢిల్లీ పాస్ పోర్టు అధికారి పాడుపని.. టచ్ లో ఉండాలంటూ రష్యన్ యువతి పట్ల వెకిలి చేష్టలు

Russian women Harasssed:రష్యాదేశానికి చెందిన ఒక యువతి మన దేశానికి వచ్చింది. ఈ క్రమంలో ఆమె తనపనులను చేసుకుని తిరిగి రష్యా వెళ్లిపోవడానికి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వెళ్లింది. అప్పుడు ఆమెకు ఊహించని ఘటన ఎదురైంది. దీనిపై ఆమె ఎక్స్ వేదికగ తన అనుభవాన్ని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది  వార్తలలో నిలిచింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 29, 2024, 06:31 AM IST
  • వెకిలి చేష్టలు వేసిన ఢిల్లీ పాస్ పోర్టు అధికారి..
  • ఇది అనైతికమంటూ ఫైర్ అవుతున్న నెటిజన్లు..
Russian women Harassed: ఢిల్లీ పాస్ పోర్టు అధికారి పాడుపని.. టచ్ లో ఉండాలంటూ రష్యన్ యువతి పట్ల వెకిలి చేష్టలు

Russian Woman Alleges Delhi Passport office of Unethical behaviour: ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశానికి ఒక మంచి గుర్తింపు ఉంది.ఇక్కడ సంప్రదాయం, ఆచారాల, పద్ధతులను అందరు గౌరవిస్తారు. ముఖ్యంగా మనదేశంలో మహిళలను ప్రత్యేకంగా గౌరవిస్తుంటారు. అదే విధంగా విదేశాల నుంచి వచ్చిన వారు, మన దేశంలోని చీరకట్టు, బొట్టు చూసి ఎంతో ఆశ్చర్యపోతుంటారు. అందుకే మన దేశానికి పర్యటన కోసం వచ్చిన ఫారెనర్స్ ఇక్కడ వాళ్లలాగానే .. చీరలు, సంప్రదాయ దుస్తులు ధరిస్తుంటారు. మన కల్చర్, దేవుళ్లు, పూజలను వారు కూడా ఎంతో గౌరవిస్తుంటారు. అందుకే ఇటీవల ఫారెన్ కంట్రీలోని అమ్మాయిలు సైతం, మనదేశంలోని అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా.. ఫారెన్ కంట్రీలోని యువతీ,యువకులు మనదేశానికి  వస్తుంటారు. అదే విధంగా మనవాళ్లు విదేశాలకు వెళ్లిన కూడా అక్కడి వాళ్లు గౌరవంగా చూసుకుంటారు.

Read More: Vampire Facial: వామ్మో.. ఫెషియల్ చేసుకున్న మహిళలకు హెచ్ఐవీ.. అసలేం జరిగిందంటే..?

ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో కొందరు భారతీయులు ప్రవర్తిస్తున్న తీరు మాత్రం వివాదాలలో ఎక్కువగా ఉంటుంది. కొందరు ఇటీవల అమెరికాలో హస్టల్ లో ల్యాప్ టాప్ లు, ఇతర వస్తువులు చోరీ చేసిన ఘటన వార్తలో నిలిచింది. అంతేకాకుండా.. కొందరు అక్కడి వాళ్లను మోసం చేసి ఇండియాకు వచ్చినట్లు కూడా వార్తలలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉండగా.. తాజాగా, ఒక పాస్ పోర్టు అధికారి, భారత పర్యటన ముగించుకున వెళ్తున్న యువతి పట్ల వెకిలిగా ప్రవర్తించాడు. ఈ ఘటనలను సదరు యువతి.. రష్యాకు వెళ్లాక సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఘటన వార్తలలో నిలిచింది. 

పూర్తి వివరాలు..

ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఒక పాస్ పోర్టు అధికారి ప్రవర్తించినతీరు ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. రష్యా నుంచి వచ్చిన యువతి మన దేశం పర్యటన ముగించుకుంది. ఆమె తిరుగు ప్రయాణంలో భాగంగా.. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వెళ్లింది. అక్కడ ఒక పాస్ పోర్టు అధికారి ఆమె పట్లు కాస్త అబ్ నార్మల్ గా ప్రవర్తించాడు. అంతేకాకుండా.. సదరు యువతికి ఒక టికెట్ ఇచ్చి దాని వెనుకాల అతని ఫోన్ నంబర్ కూడా రాసిచ్చాడు. దీంతో యువతి కాస్తంత ఇబ్బందిగా ఫీలయ్యింది. వెంటనే ఆమె తన దేశానికి వెళ్లిపోయింది.

Read More: Doctor left surgery: ఆకలేస్తోంది.. మసాల దోశ తినేసి వస్తా.. సర్జరీ మధ్యలో వెళ్లిపోయిన డాక్టర్..

ఆ తర్వాత భారత్ లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అది కాస్త వైరల్ గా మారింది. కొందరు ఆమెను సపోర్టు చేస్తు కామెంట్ లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం.. కేవలం నంబర్ రాసిచ్చినందుకు ఇంత అవసరమా... అంటూ కూడా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం.. ముక్కు మోహం తెలియని వాళ్లకు ఫోన్ నంబర్ రాసి, మాట్లాడటమనడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News