Rajasthan crisis: సచిన్ పైలట్ అలా చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు: సీఎం అశోక్ గెహ్లట్

జైపూర్: సచిన్ పైలట్ ( Sachin Pilot ) గత ఆరు నెలలుగా బీజేపీ మద్దతుతో రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రకు పాల్పడుతున్నాడని.. చూడ్డానికి అమాయకుడిలా కనిపించే సచిన్ అలా చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ( CM Ashok Gehlot ) అన్నారు.

Last Updated : Jul 20, 2020, 07:17 PM IST
Rajasthan crisis: సచిన్ పైలట్ అలా చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు: సీఎం అశోక్ గెహ్లట్

జైపూర్: సచిన్ పైలట్ ( Sachin Pilot ) గత ఆరు నెలలుగా బీజేపీ మద్దతుతో రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రకు పాల్పడుతున్నాడని.. చూడ్డానికి అమాయకుడిలా కనిపించే సచిన్ అలా చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ( CM Ashok Gehlot ) అన్నారు. సచిన్ పైలట్ బీజేపితో ( BJP ) కలిసి కుట్ర చేస్తున్నాడని తాను చెబుతూ వచ్చానని.. కానీ ఎవ్వరూ తన మాటలు నమ్మలేదని అశోక్ గెహ్లట్ అభిప్రాయపడ్డారు. నేడు జైపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ అశోక్ గెహ్లట్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమతో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ స్వేచ్ఛగా ఉన్నారని... కానీ సచిన్ పైలట్ క్యాంపులో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ( Congress MLAs ) అంతా బంధీలుగా ఉండటంతో పాటు కొంతమంది ఫోన్లు కూడా లాగేసుకున్నారని ఆరోపించారు. సచిన్ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు తమకు ఫోన్ చేసి వాళ్ల బాధలు చెప్పుకుంటున్నారని చెప్పిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్... వాళ్లలో చాలామంది వచ్చి తమతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ( Also read: Rajasthan: బీజేపీకు నో చెప్పిన సచిన్ పైలట్ )

రాజస్తాన్ సంక్షోభంలో ( Rajasthan crisis ) తామంతా సీఎం అశోక్ గెహ్లాట్‌కి మద్దతుగా ఉంటామని సూచిస్తూ.. ఆయన శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు అంతా ''హమ్ హోంగే కామ్యాబ్'' అని గేయం ఆలపించిన సంగతి తెలిసిందే. ( Also read: Vaccine: దేశీయ వ్యాక్సిన్ ట్రయల్స్ కు 1125 శాంపిల్స్ సిద్ధం )

Trending News