Satuday Remedies: శనివారం రాత్రి ఈ నియమాలు పాటిస్తే.. శనీశ్వరుడి అనుగ్రహంతో సకల బాధల విముక్తి...

శనివారం రాత్రి ఈ నియమాలు పాటిస్తే శనీశ్వరుడి అనుగ్రహంతో సకల బాధల విముక్తి కలుగుతుంది ఇంతకీ ఆ నియమాలేంటంటే..

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 14, 2022, 12:18 PM IST
  • శనివారం రాత్రి ఈ నియమాలు పాటిస్తే
  • శనీశ్వరుడి అనుగ్రహంతో సకల బాధల విముక్తి కలుగుతుంది
  • ఇంతకీ ఆ నియమాలేంటంటే..
Satuday Remedies: శనివారం రాత్రి ఈ నియమాలు పాటిస్తే.. శనీశ్వరుడి అనుగ్రహంతో సకల బాధల విముక్తి...

Saturday Remedies: హిందూ మత విశ్వాసాల ప్రకారం వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవత లేదా దేవుడికి అంకితం చేయబడింది. శనివారం శనీశ్వరుడికి అంకితం. శని దేవుడి అనుగ్రహం కలిగితే సకల బాధల నుంచి విముక్తి ప్రాప్తి కలుగుతుంది. న్యాయ దేవత అయిన శని దేవుడు కర్మానుసారం ఫలాలను అందిస్తాడు. చెడు పనులు చేసినవారికి, శని ఆగ్రహానికి గురైనవారికి చెడు ఫలితాలు తప్పవు. అయితే కొన్ని పరిహారాలతో శని దేవుడిని శాంతింపజేయవచ్చు. శని అనుగ్రహం పొందడానికి పాటించాల్సిన కొన్ని నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం...

శని అనుగ్రహం కోసం రాత్రిపూట ఈ నియమాలు పాటించాలి :

శని దేవుడికి సుగంధ వాసన అత్యంత ప్రీతిపాత్రమైనది. శనివారం రాత్రి ఇంట్లో సుగంధ ద్రవ్యాలను కాల్చడం ద్వారా ఆ సువాసనలు శని దేవుడికి తాకుతాయి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రారదోలబడుతుంది.

శనివారం రాత్రి శనీశ్వరుడి ఆలయంలో ఆవు నూనెతో దీపం వెలిగించాలి. అలాగే నల్ల నువ్వులను వెలిగించిన దీపంలో వేయాలి.

నల్ల కుక్కకు శనివారం ఆవ నూనె పెట్టాలి. తద్వారా జాతకంలో రాహు కేతు దోషాలు తొలగిపోతాయి.

నల్ల కుక్కకు శనివారం ఆవనూనె తినిపించడం వల్ల జాతకంలో ఉన్న రాహు-కేతు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.

భాద్రపద మాసంలో మొదటి శనివారం రాత్రి రావి చెట్టును పూజించాలి. రెండు చేతులతో రావిచెట్టును తాకి ఓం శనీశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఏడుసార్లు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి.

రావి చెట్టు వద్ద నాలుగు ముఖాల దీపం వెలిగించడం శుభప్రదం. తద్వారా కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, ఊహలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: Rakesh Jhunjhunwala Death: ఇండియన్ వారెన్ బఫెట్ 'రాకేష్ జున్‌జున్‌వాలా' కన్నుమూత..

Also Read: తెలుగు రాష్ట్రాల్లోనే బాదుడు ఎక్కువ.. ఢిల్లీతో పోల్చితే లీటర్ పెట్రోల్ ధరపై రూ.15 అధికం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News